News July 29, 2024
‘హల్వా’ రగిల్చిన విమర్శల యుద్ధం

‘<<13731964>>హల్వా<<>>’ వేడుక BJP, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధానికి దారి తీసింది. 2024 కేంద్ర బడ్జెట్‌కు సంబంధించిన హల్వా వేడుకలో NDA సర్కార్ దళిత, ఆదివాసీలకు చోటు కల్పించలేదని కాంగ్రెస్ విమర్శించింది. సంబంధిత ఫొటోను సోషల్ మీడియాలో పోస్టు చేసింది. దానికి BJP శ్రేణులు బదులిస్తూ గతంలో చిదంబరం ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు హల్వా వేడుకలో ఎంత మంది దళిత, ఆదివాసీలకు చోటు కల్పించారని ప్రశ్నిస్తున్నాయి.
Similar News
News February 24, 2026
నెదర్లాండ్స్ సిక్ లీవ్ నిబంధన.. మన దగ్గరా ఉండాలంటూ!

భారత్‌లో జ్వరమొచ్చినా లీవ్ దొరకక ఉద్యోగులు నానా అవస్థలు పడుతుంటే.. నెదర్లాండ్స్ ప్రభుత్వం మాత్రం బంపర్ ఆఫర్ ఇస్తోంది. ఎవరైనా తీవ్ర అనారోగ్యానికి గురైతే ఏకంగా రెండేళ్ల వరకు సిక్ లీవ్ తీసుకోవచ్చు. ఈ సమయంలో కంపెనీలు సదరు ఉద్యోగికి 70% జీతాన్ని తప్పనిసరిగా చెల్లించాలి. ఉద్యోగుల ఆరోగ్యం, మానసిక ప్రశాంతతకు పెద్దపీట వేస్తూ అక్కడి ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ నిబంధన మన దగ్గర కూడా ఉండాలనే చర్చ జరుగుతోంది.
News February 24, 2026
క్యాన్సర్‌తో నటుడు, మిస్టర్ ఇండియా మయాంక్ పవార్ మృతి

ప్రముఖ టీవీ రియాలిటీ షో ‘MTV Splitsvilla’ సీజన్ 7 కంటెస్టెంట్, ఏడుసార్లు మిస్టర్ ఇండియా టైటిల్ విన్నర్ మయాంక్ పవార్ (37) కన్నుమూశారు. కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచారు. ఫిట్‌నెస్ మోడల్‌గా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న మయాంక్ మరణవార్త విని ఇండస్ట్రీ ప్రముఖులు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. చిన్న వయసులోనే చనిపోవడం బాధాకరం అంటూ నివాళులర్పిస్తున్నారు.
News February 24, 2026
ముందు పోయేది కోడింగ్ జాబ్సే: ఆంథ్రోపిక్ CEO

ఏఐ ఆటోమేషన్ కారణంగా ముందుగా కోడింగ్ ఉద్యోగాలు పోతాయని ఆంథ్రోపిక్ CEO డారియో అమోడీ అంచనా వేశారు. సాఫ్ట్‌వేర్ రాయడంలో ఏఐ సిస్టమ్స్ వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని చెప్పారు. అయితే ఆర్కిటెక్చర్, ప్రొడక్ట్ సెన్స్, యూజర్ అండర్‌స్టాండింగ్ వంటివి ఆటోమేట్ కావడానికి కొంచెం సమయం పడుతుందని తెలిపారు. భవిష్యత్తులో 95% పనులు ఏఐ చేస్తుందని జెరోధా కో ఫౌండర్ నిఖిల్ కామత్ పాడ్‌కాస్ట్‌లో వెల్లడించారు.


