News October 10, 2025
రూ.10,896 కోట్లతో హ్యామ్ రోడ్లు: మంత్రి కోమటిరెడ్డి

TG: వచ్చే మూడేళ్లలో రోడ్లన్నీ అద్దాల్లా మెరుస్తాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా తొలి దశలో రూ.10,896 కోట్లతో 5,587kms మేర హ్యామ్ రోడ్లను వేయనున్నట్లు వెల్లడించారు. వచ్చే నెలలో టెండర్లు పిలుస్తామన్నారు. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ లేన్, జిల్లా కేంద్రాల నుంచి HYDకు 4 లేన్ రోడ్లు వేస్తామని, యాక్సిడెంట్ ఫ్రీ రోడ్ల నిర్మాణంపై దృష్టి పెట్టామని చెప్పారు.
Similar News
News October 10, 2025
OTT, TVల్లోకి ‘కిష్కింధపురి’.. డేట్స్ ఫిక్స్

తెలుగు హారర్ మూవీ ‘కిష్కింధపురి’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయింది. అక్టోబర్ 17 నుంచి Z5 ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ కానుంది. అక్టోబర్ 19న టీవీల్లోనూ ప్రేక్షకులను అలరించనుంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 12న రిలీజైంది. దెయ్యాల నేపథ్యంలో వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను భయపెట్టింది. మరి మీరు ఈ మూవీ చూశారా? ఎలా ఉందో కామెంట్ చేయండి.
News October 10, 2025
కష్టాల కడలిని దాటి.. స్ఫూర్తిగా నిలిచి

పెళ్లి తర్వాత కలలను వదిలి ఇంటికే పరిమితం అవుతారు చాలామంది. కానీ హర్యానాకు చెందిన అంజూయాదవ్ పూర్తి విరుద్ధం. 21 ఏళ్లకే పెళ్లై, 22 ఏళ్లకే తల్లైంది అంజు. ఇంటి బాధ్యతలు నిర్వరిస్తూ తల్లి సాయంతో టీచర్‌గా ఉద్యోగం సాధించింది. తర్వాత రాజస్థాన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్‌కు ప్రిపేర్ అవుతుండగా భర్త మరణించాడు. ఒంటరితల్లిగా కష్టపడిన ఆమె ఇప్పుడు RASలో DSPగా విధులు నిర్వర్తిస్తూ ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు.
News October 10, 2025
మొదట గూగుల్.. ఇప్పుడు మెటా: లోకేశ్

AP: మెటా సంస్థ తన సబ్‌సీ కేబుల్ ప్రాజెక్ట్ ‘వాటర్ వర్త్’ను వైజాగ్‌కు తీసుకురావాలని భావిస్తోందని మంత్రి నారా లోకేశ్ ట్వీట్ చేశారు. Economic Timesలో ప్రచురితమైన కథనాన్ని షేర్ చేశారు. ఇండియాలో AI నగరంగా, డేటా సిటీగా విశాఖను ఇది మరింతగా ఎస్టాబ్లిష్ చేస్తుందని పేర్కొన్నారు. తొలుత గూగుల్ డేటా సెంటర్, ఇప్పుడు మెటా అంటూ ఆయన పోస్టు పెట్టారు.