News October 4, 2025

బందీల విడుదలకు హమాస్ అంగీకారం

image

ఇజ్రాయెలీ బందీలు(మృతులు/బతికున్నవారు) అందరినీ రిలీజ్ చేసేందుకు హమాస్ అంగీకరించింది. ట్రంప్ ప్రతిపాదించిన పీస్ డీల్ ప్రకారం ఈ నిర్ణయం తీసుకుంది. వెంటనే మధ్యవర్తుల ద్వారా ఈ ప్లాన్‌పై చర్చించాలని ప్రకటన రిలీజ్ చేసింది. అరబ్, ఇస్లామిక్ తదితర దేశాలు, ట్రంప్‌ ప్రయత్నాలను స్వాగతిస్తున్నామంది. అధికారం వదిలేందుకు సిద్ధంగా ఉన్నట్లు సిగ్నల్ ఇచ్చింది. దీంతో 2023 OCTలో మొదలైన వార్‌కు త్వరలో తెరపడే అవకాశముంది.

Similar News

News October 4, 2025

అసలే ట్రంప్.. ఆపై చేతిలో కొత్త ఆయుధం!

image

‘నోబెల్’ కోసం ట్రంప్ కరవని గడ్డి లేదు. IND-PAKతో పాటు 7యుద్ధాలు ఆపానని ప్రకటించుకున్న ‘ట్రంపరి’ చేష్టలు చూశాం. తాజాగా <<17908342>>ఇజ్రాయెల్-హమాస్<<>> యుద్ధం ముగిసేలా ఓ ముందడుగు పడింది. దీంతో ‘అసలే ట్రంప్.. ఆపై చేతిలో హమాస్-ఇజ్రాయెల్ ఆయుధం’ ఇక ఆయన్ను ఆపగలమా! అని SMలో చర్చ జరుగుతోంది. నోబెల్ కోసం దేశాల మధ్య యుద్ధ పరిస్థితులు తెచ్చి, ఆపై వాటిని ఆపినట్లు ప్రకటించుకోవడానికైనా వెనుకాడరనే మీమ్స్ పుట్టుకొస్తున్నాయి.

News October 4, 2025

సెప్టెంబర్‌లో రూ.3,046 కోట్ల లిక్కర్ అమ్మకాలు

image

TG: దసరాకు ముందు 4 రోజుల వ్యవధిలోనే రూ.800 కోట్లకు పైగా లిక్కర్ అమ్మకాలు జరిగాయని అధికారులు తెలిపారు. దసరా రోజే గాంధీ జయంతి కావడంతో ముందుగానే మందుబాబులు <<17903379>>మద్యం<<>> షాపులకు క్యూలు కట్టారు. సెప్టెంబర్ 28న రూ.200 కోట్లు, 29న రూ.278 కోట్ల సేల్స్ జరిగాయని అధికారులు వెల్లడించారు. ఈ జోరుకు దసరాతో పాటు స్థానిక ఎన్నికల ముందస్తు పార్టీలు కారణం. సెప్టెంబర్ రూ.3,046 కోట్ల మద్యం అమ్మకాలు జరిగినట్లు పేర్కొన్నారు.

News October 4, 2025

ఏ నామం స్మరిస్తే ఏ ఫలితం ఉంటుంది?

image

శ్రీరామా! అని స్మరిస్తే విజయం దక్కుతుంది.
దామోదర! అంటే బంధముల నుంచి విముక్తులవుతారు.
నారాయణా! అని జపిస్తే సకల గ్రహ దోషాలు తొలగిపోతాయి.
అచ్యుతా! అని పిలిస్తే ఆహారమే ఔషధం అవుతుంది.
గోవిందా! అని స్మరిస్తే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది.
నరసింహా! అంటే మీలో భయం పోతుంది.
కృష్ణా! అని తలచుకుంటే కష్టాలు మాయమవుతాయి.
జగన్నాథా! అంటే ప్రశాంతత లభిస్తుంది.
మాధవా! అని స్ఫురిస్తే పనులు పూర్తవుతాయి.