News April 5, 2025
దాడులు ఆపకపోతే బందీల ప్రాణాలకే ముప్పు: హమాస్

గాజాపై ఇజ్రాయెల్ దాడులు ఆపకపోతే తమ వద్ద ఉన్న బందీల ప్రాణాలకే ప్రమాదమని హమాస్ తెలిపింది. తాము ఇజ్రాయెల్‌కు బందీలను అప్పగించే విషయంపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొంది. ఇజ్రాయెల్ ఆర్మీ పాలస్తీనియన్లను గాజా నుంచి బలవంతంగా ఇక్కడి నుంచి తరలిస్తోందని ఆరోపించింది. కాగా గాజాలో ఇంకా 59 మంది ఇజ్రాయెలీ బందీలు ఉన్నట్లు ఆ దేశం ప్రకటించింది. వారిని కాపాడేందుకు గాజాలో గ్రౌండ్ అఫెన్సివ్ ప్రారంభించింది.
Similar News
News April 5, 2025
ఒత్తిడిని తగ్గించుకునేందుకు కొన్ని టిప్స్

* కండరాలను రిలాక్స్ చేసేందుకు గోరువెచ్చని నీటితో స్నానం చేయండి.
* నవ్వేందుకు కాస్త సమయం కేటాయించండి.
* ధ్యానం, శ్వాస వ్యాయామాలు (గ్రౌండింగ్ టెక్నిక్స్) పాటించండి.
* అనవసరమైన బాధ్యతలు తీసుకోకుండా ‘నో’ చెప్పడం అలవాటు చేసుకోండి.
* నమ్మకమైన వ్యక్తితో మీ భావాలు పెంచుకోండి. పాజిటివ్ మాటలు పంచుకోండి.
News April 5, 2025
TTD దర్శన సిఫార్సులు ఇకపై ఆన్‌లైన్‌లో..

TG: తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి రాష్ట్ర ప్రజాప్రతినిధులు తమ సిఫార్సు లేఖలను ఆన్‌లైన్‌లో జారీ చేసేలా CMO ఓ ప్రత్యేక పోర్టల్ cmottd.telangana.gov.in రూపొందించింది. ఇకపై సిఫార్సు లేఖల్ని ఇందులో నమోదు చేయాల్సిందే అని CMO స్పష్టం చేసింది. ఈ పోర్టల్ నుంచి భక్తులు, దర్శన వివరాలతో జారీ అయ్యే లేఖలనే TTD అంగీకరిస్తుందని చెప్పింది. ఈ లేఖలతో సోమవారం నుంచి గురువారం వరకు దర్శనాలు కల్పిస్తారు.
News April 5, 2025
NTR లుక్‌పై అభిమానుల ఆందోళన!

యంగ్ టైగర్ NTR కొత్త లుక్‌పై అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘NTR-NEEL’ సినిమా కోసం ఆయన ఒక్కసారిగా బరువు తగ్గారు. ఎన్టీఆర్ అంటే కాస్త చబ్బీగా కండలు తిరిగిన బాడీతో ఉండాలని, ఇంత స్లిమ్ అవ్వడం ఏంటని కొందరు అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఈ లుక్ ఆయనకు సూట్ కాలేదని అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కొందరేమో స్లిమ్‌గా అదిరిపోయారు అంటూ సపోర్ట్ చేస్తున్నారు. ఇంతకీ ఎన్టీఆర్ లుక్ మీకెలా అనిపించింది? COMMENT