News May 14, 2024

హమాస్‌ ఉగ్రసంస్థ కాదు: టర్కీ అధ్యక్షుడు

image

హమాస్‌ను తాము ఉగ్ర సంస్థగా పరిగణించమని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ తాజాగా తేల్చిచెప్పారు. ఇజ్రాయెల్ దాడిలో గాయపడిన వెయ్యికి పైగా హమాస్ సభ్యులు తమ దేశంలో చికిత్స పొందుతున్నారని వెల్లడించారు. ఆ సంస్థకు తమ మద్దతు కొనసాగుతుందని స్పష్టం చేశారు. గ్రీస్ ప్రధాని కిరియాకోస్‌తో కలిసి నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం ఆసక్తికరం.

Similar News

News March 26, 2026

రాజధాని పేరుతో అమరావతిలో అవినీతి యజ్ఞం: సజ్జల

image

AP: అమరావతి చట్టబద్ధతకు అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన అవసరం ఏంటని YCP నేత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రశ్నించారు. అలాగైతే మండలిలోనూ చర్చ పెట్టాలన్నారు. అమరావతిలో CM చంద్రబాబు అవినీతి యజ్ఞం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిపై జగన్‌కు అభ్యంతరం లేదని, అందుకే CBN కంటే ముందే భూమి కొనుక్కొని ఆఫీస్, ఇల్లు కట్టుకున్నట్లు చెప్పారు. రాజధాని పేరుతో జరుగుతున్న అవినీతిని ఆయన వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.

News March 26, 2026

అంతరాయం లేకుండా ఇంధన సరఫరా: కేంద్రం

image

దేశంలో గ్యాస్, పెట్రోల్, డీజిల్ కొరత లేదని కేంద్రం పునరుద్ఘాటించింది. అన్ని రిటైల్ ఔట్‌లెట్లకు సరిపడా సప్లై చేస్తున్నట్లు పేర్కొంది. దేశంలోని ప్రతి సిటిజెన్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా ఇంధన సరఫరాకు కట్టుబడి ఉన్నట్లు స్పష్టం చేసింది. తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దని, అధికారిక ప్రకటనలు మాత్రమే ఫాలో కావాలని విజ్ఞప్తి చేసింది. దేశంలో 2 నెలలకు సరిపడా ఆయిల్ ఉందని వెల్లడించింది.

News March 26, 2026

రేపే శ్రీరామనవమి.. ముహూర్తం ఇదే

image

శ్రీరామనవమి వేడుకలకు తెలుగు రాష్ట్రాలు సిద్ధమయ్యాయి. రేపు చైత్ర శుద్ధ నవమి రోజున ఉ.11.06 నుంచి మ.1.31 వరకు రఘురాముడి పూజకు మంచి సమయమని పండితులు చెబుతున్నారు. భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కూడా ఇదే సమయంలో జరుగుతుందంటున్నారు. మ.ఒంటి గంటలోపు ఇంట్లో స్వామివారికి నివేదన సమర్పించి, ఆ తర్వాత ప్రసాదాన్ని స్వీకరించి భోజనం చేయాలని సూచిస్తున్నారు. ఇక రేపు భద్రాద్రిలో 12pmకు సీతారాముల కళ్యాణం జరగనుంది.