News October 12, 2025
‘గాజా పీస్ డీల్’కు హమాస్ ససేమిరా!

ఈజిప్ట్‌లో జరగనున్న ‘గాజా పీస్ డీల్’ కార్యక్రమానికి హమాస్ దూరంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. US అధ్యక్షుడు ట్రంప్ ప్రతిపాదించిన శాంతి ఒప్పందంలో హమాస్‌కు అభ్యంతరాలున్నట్లు అంతర్జాతీయ మీడియా పేర్కొంది. ‘పాలస్తీనియన్లు హమాస్ సభ్యులు అయినా, కాకపోయినా వారిని వారి దేశం నుంచి బహిష్కరించడం గురించి మాట్లాడటం అర్థంలేనిది. ఆయుధాల అప్పగింతకు అసలు తావులేదు’ అని హమాస్ లీడర్లు చెప్పినట్లు వార్తలొచ్చాయి.
Similar News
News October 12, 2025
ఆనంద్‌కు క్షమాపణలు చెప్పిన కాస్పరోవ్

క్లచ్ చెస్ టోర్నీలో విశ్వనాథ్ ఆనంద్‌పై రష్యన్ ప్లేయర్ కాస్పరోవ్ 13-11తో విజయం సాధించారు. రెండో రోజు తొలి ర్యాపిడ్ గేమ్‌లో గెలిచే స్థితిలో ఉన్నప్పటికీ ఆనంద్ ఓడిపోయారు. తాను టైమ్ ముగిశాక చెప్పడం వల్లే ఇది జరిగిందని, ఇందుకు ఆనంద్‌కు క్షమాపణలు చెప్పినట్లు కాస్పరోవ్ తెలిపారు. తాను శిక్షకు అర్హుడినని పేర్కొన్నారు. కాగా విజేతగా నిలిచిన కాస్పరోవ్ రూ.69 లక్షలు, ఆనంద్ రూ.58.55 లక్షల బహుమతి అందుకున్నారు.
News October 12, 2025
AP న్యూస్ అప్డేట్స్

* విజయవాడ – సింగపూర్ విమాన సర్వీస్ NOV 15 నుంచి తిరిగి ప్రారంభం
* ఆఫ్రికాలో కల్తీ మద్యం వ్యాపారం చేసింది జగన్ బినామీలే: TDP నేత వర్ల రామయ్య
* PPP మెడికల్ కాలేజీలు నిలిపివేయాలని హైకోర్టులో BSP PIL దాఖలు
* జాతీయ జూనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 1500మీ. రన్నింగ్‌లో గోల్డ్ గెలిచిన వెంకట్రామ్ రెడ్డి (కర్నూలు), 100మీ. హర్డిల్స్‌లో రోషన్‌కు (గుంటూరు) సిల్వర్
News October 12, 2025
రూపాయికే కూరగాయల మొక్క.. మనకూ కావాలి!

ఉద్యానవన పంటలను ప్రోత్సహించడానికి ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం రైతులకు రూపాయికే కూరగాయల మొక్కలను అందిస్తోంది. ఇందుకోసం సుర్గుజా(D)లో విత్తనాల యూనిట్ నెలకొల్పింది. అన్నదాతలు తమకు నచ్చిన సీడ్స్ ఆ యూనిట్‌కు ఇస్తే సాంకేతికత సాయంతో నాణ్యమైన మొక్కలుగా తయారుచేసి రూ.1కే అందిస్తోంది. ఇలాంటి పథకం AP, TGలోనూ ఉంటే ఉపయోగకరంగా ఉంటుంది. ఏమంటారు?
* అగ్రికల్చర్ కంటెంట్ కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.