News October 3, 2025

యుద్ధాన్ని ముగించకపోతే హమాస్‌కు నరకమే: ట్రంప్

image

ఇజ్రాయెల్‌తో యుద్ధం ముగించాలని హమాస్‌కు US ప్రెసిడెంట్ ట్రంప్ గడువు విధించారు. ఆదివారంలోగా దీనిపై ఒప్పందం చేసుకోకపోతే హమాస్‌కు నరకం అంటే ఏంటో చూపిస్తామని హెచ్చరించారు. ‘హమాస్ చాలా ఏళ్లుగా మిడిల్ ఈస్ట్‌లో హింసాత్మక ముప్పుగా ఉంది. 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లో మారణహోమం సృష్టించింది. ఆ దాడికి ప్రతీకారంగా ఇప్పటివరకు 25,000+ హమాస్ సైనికులు హతమయ్యారు’ అని ట్రంప్ ట్రూత్ సోషల్‌లో పోస్ట్ చేశారు.

Similar News

News October 4, 2025

AP, TG న్యూస్ రౌండప్

image

☛ రేపు HYDకు AICC ఇన్‌ఛార్జ్ మీనాక్షి నటరాజన్.. లోకల్ బాడీ ఎన్నికలు, జూబ్లీహిల్స్ ఉపఎన్నిక అభ్యర్థి ఎంపికపై పార్టీ నేతలతో చర్చ
☛ మంగళగిరి-కృష్ణా కాలువ స్టేషన్ల మధ్య రూ.112 కోట్లతో ROB నిర్మాణానికి రైల్వే శాఖ గ్రీన్ సిగ్నల్
☛ నవంబర్ 5 నుంచి 9 వరకు కడప దర్గా ఉరుసు మహోత్సవం
☛ TG: ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపు పునః ప్రారంభం

News October 4, 2025

₹5కోట్ల ఇన్సూరెన్స్… హత్య చేసి ఆపై క్లెయిమ్ కోసం నాటకం

image

ఓ గ్యాంగ్ ₹5.2కోట్ల ఇన్సూరెన్స్ చేసుకున్న వ్యక్తిని హత్యచేసి ఆ మొత్తం క్లెయిమ్‌కోసం నకిలీ భార్యతో డ్రామా ఆడించింది. పక్షవాతం ఉన్న కౌల్పేట్ (KA)కు చెందిన గంగాధర్‌కు బీమా ఉంది. గమనించిన ముఠా అతణ్ని చంపి బాడీని టూవీలర్‌పై పెట్టి కారుతో గుద్దించింది. ముఠాలోని మహిళతో CLAIM చేయించింది. డెడ్‌బాడీ విషయం తెలిసి పోలీసులు అసలు భార్యను విచారించగా టూవీలర్ లేదని తేలింది. తీగలాగి మొత్తం ముఠాను అరెస్టు చేశారు.

News October 3, 2025

రోహిత్, కోహ్లీ వచ్చేస్తున్నారు!

image

ఈనెల 19 నుంచి AUSతో జరగనున్న వన్డే సిరీస్‌కు రేపు భారత జట్టును ప్రకటించే అవకాశం ఉంది. వీరిద్దరూ వన్డేలు మినహా టెస్ట్, టీ20ల నుంచి రిటైరైన విషయం తెలిసిందే. దీంతో AUSతో మ్యాచులకు జట్టులోకి ఎంట్రీ ఇవ్వనున్నారు. చాలారోజుల తర్వాత మైదానంలో అడుగుపెట్టనున్న ‘రోకో’ జోడీని చూసేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అటు కెప్టెన్‌గా రోహిత్‌ను కొనసాగిస్తారా లేక మరొకరికి ఛాన్స్ ఇస్తారా? అనేది చూడాలి.