News September 29, 2024
ఏపీలో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ వ్యాధి కలకలం
AP: విజయవాడ, గుంటూరు, విశాఖతో పాటు పలు ప్రాంతాల్లో ‘హ్యాండ్ ఫుట్ మౌత్’ అనే వ్యాధి కలకలం రేపుతోంది. నెలల శిశువుల నుంచి ఆరేళ్ల వయసున్న చిన్నారులు ఈ వ్యాధితో ఎక్కువగా బాధపడుతున్నారు. కాక్సీకీ అనే వైరస్ ద్వారా వచ్చే ఈ వ్యాధి ప్రాణాంతకం కాదని డాక్టర్లు చెబుతున్నారు. జ్వరం, తలనొప్పి, జలుబు, చేతులు, కాళ్లు, ముఖం, నోటిలో పుండ్లు, దద్దుర్లు, మంట వంటి లక్షణాలు ఉంటే డాక్టర్లను సంప్రదించాలని సూచిస్తున్నారు.
Similar News
News January 10, 2025
నా వ్యాఖ్యలు పవన్‌ను ఉద్దేశించినవి కాదు: BR నాయుడు
AP డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను ఉద్దేశించి తాను ఏదో అన్నట్లు తప్పుడు ప్రచారం జరుగుతోందని TTD ఛైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ‘సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరి కామెంట్స్‌కి స్పందించాల్సిన అవసరం లేదనే ఉద్దేశంతోనే నేను మాట్లాడా. నా వ్యాఖ్యలను పవన్‌కు ఆపాదించడం భావ్యం కాదు. మొన్న ఘటన జరిగిన వెంటనే భక్తులు, మృతుల కుటుంబాలకు క్షమాపణ చెప్పాను’ అని ఆయన Xలో రాసుకొచ్చారు.
News January 10, 2025
పాత పద్ధతిలో స్కూళ్లు.. పలు మార్పులు
AP పాఠశాలల స్ట్రక్చర్‌ను మారుస్తూ గత ప్రభుత్వం జారీచేసిన GO 117ను ఉపసంహరించాలని కూటమి సర్కారు నిర్ణయించింది. అంతకు ముందున్న విధానాన్నే స్వల్ప మార్పులతో తిరిగి ప్రవేశపెట్టాలని ప్రతిపాదిస్తోంది. శాటిలైట్ ఫౌండేషనల్ స్కూల్ (pp1 pp2), ఫౌండేషనల్ స్కూల్ (pp1, pp2, 1, 2) బేసిక్ ప్రైమరీ(1-5), మోడల్ ప్రైమరీ(pp1, pp2, 1-5), హైస్కూల్ (6-10) విధానంలో స్కూళ్లు ఉంటాయి. విధివిధానాలపై విద్యాశాఖ మెమో జారీచేసింది.
News January 10, 2025
ఓటీటీలోకి సూపర్ హిట్ చిత్రం
బాసిల్ జోసెఫ్, నజ్రియా ప్రధాన పాత్రల్లో నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ‘సూక్ష్మదర్శిని’ రేపు ఓటీటీలోకి రానుంది. డిస్నీ+హాట్‌స్టార్‌లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ కానుంది. రూ.5 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 22న విడుదలై దాదాపు రూ.60కోట్ల కలెక్షన్లను సాధించింది. ఎంసీ జతిన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాకు IMDbలో 8.1 రేటింగ్ ఉంది.