News February 6, 2025
సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారు.. వలసదారుల ఆవేదన

US నుంచి INDకు చేరుకున్న వలసదారులు మీడియాతో ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో ఉన్నంతసేపు చేతులకు సంకెళ్లు వేసి, కాళ్లను గొలుసులతో కట్టేశారని 36 ఏళ్ల జస్‌పాల్ సింగ్ వాపోయారు. అమృత్‌సర్‌లో ఫ్లైట్ ల్యాండ్ అవ్వగానే వాటిని తీసేశారని చెప్పారు. అయితే వలసదారుల చేతులకు సంకెళ్లున్న ఫొటోలు వైరల్ కాగా కేంద్రంపై కాంగ్రెస్ తీవ్రంగా మండిపడింది. కానీ ఆ ఫొటోలు గ్వాటెమాల వలసదారులవని PIB ఫ్యాక్ట్‌చెక్ తెలిపింది.
Similar News
News February 13, 2026
తల్లిపాల గురించి ఈ విషయాలు తెలుసా?

తల్లిపాలు తాగడం వల్ల పిల్లలకే కాదు.. పిల్లలకి పాలు ఇవ్వడం వల్ల తల్లికి కూడా అనేక లాభాలు ఉన్నాయి. పిల్లలకి పాలివ్వడం వల్ల తల్లికి బ్రెస్ట్ క్యాన్సర్, అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా వరకూ తగ్గుతాయంటున్నారు నిపుణులు. తల్లిపాలు తాగిన పిల్లల్లో ఐక్యూ ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. తల్లిపాలు శిశువుకు సులువుగా అరగడంతో పాటు రోగనిరోధకశక్తిని అందిస్తాయి. కాబట్టి తల్లిపాలివ్వడం ముఖ్యమని చెబుతున్నారు.
News February 13, 2026
RR కెప్టెన్‌గా రియాన్ పరాగ్!

రాజస్థాన్ రాయల్స్ నూతన కెప్టెన్‌గా రియాన్ పరాగ్‌ను ఎంపిక చేసినట్లు క్రీడా వర్గాలు వెల్లడించాయి. గతేడాది ఐపీఎల్ సీజన్‌లోనూ కొన్ని మ్యాచ్‌లకు అతను కెప్టెన్‌గా వ్యవహరించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది సంజూ శాంసన్‌ను చెన్నై కొనుగోలు చేయడంతో పరాగ్‌కు లైన్ క్లియర్ అయినట్లు తెలుస్తోంది.
News February 13, 2026
నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ

TG: నల్గొండ జిల్లాలో కాంగ్రెస్ బోణీ కొట్టింది. నందికొండ మున్సిపాలిటీలో 12 స్థానాలకు గాను కాంగ్రెస్ అభ్యర్థులు 11 చోట్ల గెలిచారు. BRS ఒక స్థానంలో విజయం సాధించింది. ఇదే జిల్లాలోని హాలియాలో 12 వార్డులకు గాను కాంగ్రెస్ పదింట్లో గెలిచి మున్సిపాలిటీని కైవసం చేసుకుంది. BRS రెండు వార్డుల్లో విజయం సాధించింది. చండూరు, చిట్యాల మున్సిపాలిటీలను సైతం కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది.


