News January 1, 2025

హ్యాంగోవర్‌ సమస్యలా.. ఇలా చేయండి!

image

మందుపై దండయాత్ర చేసిన వారు ఈరోజు ఉదయమే హ్యాంగోవర్‌తో ఇబ్బందిపడుతుంటారు. అల్లం హ్యాంగోవర్ వల్ల తలెత్తే వికారాన్ని పోగొడుతుంది. ఎలక్ట్రోలైట్ డ్రింక్స్ తీసుకోండి. మంచినీటిని నెమ్మదిగా తాగండి. తగినంత నిద్రపోవాలి. నిమ్మరసంలో తేనె కలిపి తాగాలి. నువ్వుల గింజల్లో బెల్లం కలిపి తినండి. B6, B12తో పాటు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉండే సాల్మన్ చేప తినొచ్చు. ముఖ్యంగా మద్యపానం ఆరోగ్యానికి హానికరమని గుర్తుంచుకోండి.

Similar News

News January 4, 2025

కెనడాలో పుష్ప-2 ఆల్‌టైమ్ రికార్డ్

image

దేశవిదేశాల్లో పుష్ప-2 రికార్డుల మోత కొనసాగిస్తోంది. తాజాగా కెనడాలో 4.13 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ క్రమంలో ‘కల్కి 2898ఏడీ’ కలెక్షన్లను అధిగమించింది. కెనడాలో అత్యధిక వసూళ్లు దక్కించుకున్న సౌత్ ఇండియన్ సినిమాగా చరిత్ర సృష్టించింది. మొత్తంగా మూవీ రూ.1800కోట్ల మార్కును దాటిన సంగతి తెలిసిందే.

News January 4, 2025

మళ్లీ బండి సంజయ్‌కే టీబీజేపీ పగ్గాలు?

image

TG: రాష్ట్రంలో బీజేపీ పగ్గాల్ని మాజీ అధ్యక్షుడు బండి సంజయ్‌కే మరోమారు ఇవ్వాలని ఆ పార్టీ అధిష్ఠానం యోచిస్తున్నట్లు సమాచారం. ఇక సీనియర్ నేత ఈటల రాజేందర్‌కు కేంద్రమంత్రి పదవిని ఇచ్చే అవకాశం ఉందని పార్టీ వర్గాలంటున్నాయి. గతంలో అధ్యక్షుడిగా ఉన్న సమయంలో రాష్ట్రంలో బీజేపీని సంజయ్ పరుగులు పెట్టించిన సంగతి తెలిసిందే. కాగా.. అధ్యక్ష రేసులో ప్రస్తుతం ఎంపీలు అరవింద్, రఘునందన్‌రావు, డీకే అరుణ, ఈటల ఉన్నారు.

News January 4, 2025

ఏపీలో 7 కొత్త ఎయిర్‌పోర్టులు

image

ఏపీలో కొత్తగా కుప్పం, దగదర్తి, శ్రీకాకుళం, తాడేపల్లిగూడెం, నాగార్జునసాగర్, తుని-అన్నవరం, ఒంగోలులో 7 ఎయిర్‌పోర్టులు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీకాకుళంలో ఎయిర్‌పోర్టు ఫీజిబిలిటీ సర్వే పూర్తైంది. మిగతాచోట్ల సర్వే చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడుతో జరిగిన సమీక్షలో CM చంద్రబాబు కోరారు. అటు గన్నవరంలో కొత్త టెర్మినల్ భవనాన్ని కూచిపూడి నృత్యం, అమరావతి స్తూపం థీమ్‌తో నిర్మించనున్నారు.