News April 17, 2024
TVల్లోకి వచ్చేస్తోన్న ‘హనుమాన్’

తేజ సజ్జా హీరోగా నటించిన ‘హనుమాన్’ మూవీ టీవీల్లోకి వచ్చేస్తోంది. ఈ నెల 28న సాయంత్రం 5.30 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది. ప్రశాంత్ వర్మ తెరకెక్కించిన ఈ మూవీలో అమృత అయ్యర్ హీరోయిన్గా నటించారు. సముద్ర ఖని, వరలక్ష్మీ శరత్కుమార్, గెటప్ శ్రీను కీలక పాత్రలు పోషించారు. సంక్రాంతికి విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకుపైగా వసూళ్లు రాబట్టింది.
Similar News
News November 15, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* విశాఖ CII సదస్సులో WEF సెంటర్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్
* పరకామణి కేసు ఫిర్యాదుదారు సతీశ్ మృతిపై దర్యాప్తు ముమ్మరం.. అనంతపురం చేరుకున్న సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్
* గ్రీన్ హైడ్రోజన్ వ్యాలీ ఆఫ్ ఇండియాగా ఏపీ అవతరిస్తోందన్న మంత్రి గొట్టిపాటి
* చంద్రబాబుపై నమ్మకం లేక కంపెనీలు పెట్టుబడుల్ని భారీగా తగ్గిస్తున్నాయని YCP విమర్శలు
News November 15, 2025
‘సజ్జనార్’ పేరుతోనే ఫ్రెండ్ను మోసగించిన సైబర్ నేరగాళ్లు!

సైబర్ నేరాలపై అవగాహన కల్పించే హైదరాబాద్ CP సజ్జనార్ మిత్రుడికి కేటుగాళ్లు షాక్ ఇచ్చారు. ఆయన పేరుతో ఫేక్ FB అకౌంట్ క్రియేట్ చేసి ఆపదలో ఉన్నానంటూ డబ్బులు పంపాలని మెసేజ్లు పంపారు. దీంతో ఇది నిజమే అనుకొని తన స్నేహితుడు రూ.20వేలు పంపించి మోస పోయారని సజ్జనార్ ట్వీట్ చేశారు. ‘నా పేరుతో, లేదా ఏ అధికారి/ ప్రముఖ వ్యక్తి పేరుతో ఫేస్బుక్లో డబ్బులు పంపాలని వచ్చే సందేశాలను అసలు నమ్మకండి’ అని ఆయన సూచించారు.
News November 15, 2025
అబార్షన్ అయినా లీవ్ తీసుకోవచ్చు

మహిళలు ఎదుర్కొనే సమస్యల్లో ఒకటి గర్భస్రావం. ప్రమాదవశాత్తూ అబార్షన్ అయినా, తల్లీబిడ్డల ఆరోగ్యాన్ని బట్టి తప్పనిసరై గర్భస్రావం చేయాల్సి వచ్చినా మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ చట్టం-1971 ప్రకారం అలాంటి పరిస్థితుల్లో ఉద్యోగినులు ఆరు వారాల జీతంతో కూడిన సెలవు పొందవచ్చు. అయితే దీనికి తగిన డాక్యుమెంట్లు చూపించాలి. అబార్షన్ కారణంగా ఆమె తీవ్ర అనారోగ్యం పాలైతే మరో నెల అదనంగా సెలవు పొందవచ్చు.


