News May 10, 2024

KTRపై టమాటాలు విసిరిన హనుమాన్ భక్తులు అరెస్టు.. ఆందోళన

image

TG: నిన్న నిర్మల్ జిల్లా భైంసాలో BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRపై టమాటాలతో విసిరిన 23 మంది హనుమాన్ దీక్షాపరులను పోలీసులు అరెస్టు చేశారు. వారిని వెంటనే విడుదల చేయాలని హనుమాన్ భక్తులు, బీజేపీ నేతలు పీఎస్ ముందు ఆందోళనకు దిగారు. కేటీఆర్ హిందువుల మనోభావాలు దెబ్బతీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Similar News

News March 19, 2026

వార్ ఎఫెక్ట్.. పెరగనున్న సిమెంట్ ధరలు?

image

పశ్చిమాసియాలోని ఉద్రిక్తతల ప్రభావం దేశంలోని సిమెంట్ ధరలపైనా పడే అవకాశం ఉంది. MAR నెలాఖరు లేదా APR మొదటి వారంలో ధరలు పెరగొచ్చని నువామా రిపోర్ట్ వెల్లడించింది. పెట్‌కోక్, ప్యాకేజింగ్ ధరలు పెరుగుతుండటంతో ఆ భారాన్ని తగ్గించుకునేందుకు డీలర్లు ప్రైస్ పెంచొచ్చని తెలిపింది. సిమెంట్ తయారీకి వాడే పెట్రోలియమ్ కోక్ (పెట్ కోక్)ను చమురు నుంచి వెలికితీస్తారు. క్రూడ్ ధరల హైక్‌తో పెట్ కోక్ ధరలూ పెరుగుతున్నాయి.

News March 19, 2026

‘పుష్ప-2’ రికార్డు బద్దలైంది!

image

‘ధురంధర్-2’ భారత సినిమా రికార్డులను తిరగరాస్తోంది. ‘బుక్ మై షో’లో ఒక్క గంటలోనే రికార్డు స్థాయిలో 1.09 లక్షల టికెట్లు అమ్ముడయ్యాయి. గతంలో ఈ రికార్డు పుష్ప-2 (1.07 లక్షలు) పేరిట ఉండేది. వీకెండ్స్‌లో ఈ మూవీ టికెట్ సేల్స్ మరింతగా పెరుగుతాయని, భారీ కలెక్షన్లు పక్కా అని నెటిజన్లు అంటున్నారు. కాగా గతేడాది వచ్చిన ధురంధర్ దాదాపు రూ.1,350 కోట్లు వసూలు చేసింది.

News March 19, 2026

పంచాంగ పఠనం.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందన్న మాడుగుల

image

AP: ప్రభుత్వం విజయవాడలో నిర్వహించిన ఉగాది సంబరాల్లో మాడుగుల నాగఫణి శర్మ పంచాంగ పఠనం చేశారు. పరాభవ నామ సంవత్సరంలో ప్రభుత్వానికి విజయం సిద్ధిస్తుందని పేర్కొన్నారు. లగ్నాల ప్రకారం ఈ ఏడాది వర్షపాతం బాగానే ఉంటుందని.. ఉగాదికి ముందుగానే కురిసిన వర్షం దీనికి సూచిక అని తెలిపారు. అమరావతి విశ్వనగరిగా ఎదుగుతుందని.. రాష్ట్రానికి ఆర్థిక ప్రగతి ఉంటుందని చెప్పారు. ప్రజలు సుఖ శాంతులతో ఉంటారని వివరించారు.