News April 12, 2025
ఏడాదికి రెండు సార్లు హనుమజ్జయంతి.. ఎందుకంటే..

నేడు చైత్ర శుద్ధ పౌర్ణమి. హనుమంతుడు లంకలో సీతామాతను కనుగొని ఆ నగరాన్ని దహనం చేసిన రోజు. ఆ ఘట్టానికి గుర్తుగా ఏటా ఈ తిథిని హనుమాన్ విజయోత్సవం లేదా జయంతిగా జరుపుకొంటారు. ఇక పరాశర సంహిత ప్రకారం.. వైశాఖ మాసం బహుళపక్ష దశమి రోజున స్వామివారు జన్మించారు. ఆ తిథిని జన్మోత్సవం/జయంతిగా జరుపుతారు. రెండు సందర్భాల్నీ చాలామంది జయంతిగానే జరపడం వల్ల ఏటా 2సార్లు హనుమజ్జయంతి వస్తుంటుంది.
Similar News
News December 1, 2025
ఢిల్లీకి మంత్రి లోకేశ్.. రేపు కేంద్ర మంత్రులతో భేటీ

AP: మంత్రులు నారా లోకేశ్, వంగలపూడి అనిత ఢిల్లీ వెళ్లారు. వారికి కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఎంపీలు స్వాగతం పలికారు. రేపు పార్లమెంట్‌లో కేంద్ర మంత్రులు అమిత్ షా, శివరాజ్ సింగ్ చౌహాన్‌తో లోకేశ్, అనిత భేటీ కానున్నారు. మొంథా తుఫాను ప్రభావం వల్ల జరిగిన నష్టం అంచనా రిపోర్టును వారికి అందిస్తారు.
News December 1, 2025
దిగ్గజ టెన్నిస్ ప్లేయర్ కన్నుమూత

ఇటలీకి చెందిన దిగ్గజ టెన్నిస్ ప్లేయర్, రెండుసార్లు ఫ్రెంచ్ ఓపెన్ విజేత నికోలా పియట్రాంగెలీ(92) కన్నుమూశారు. ఈ విషయాన్ని ఇటలీ టెన్నిస్ ఫెడరేషన్ ధ్రువీకరించింది. ప్రపంచ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్‌లో ఇటలీ నుంచి చోటు దక్కించుకున్న ఏకైక ప్లేయర్ నికోలానే కావడం విశేషం. తన కెరీర్‌లో 44 సింగిల్స్ టైటిళ్లను గెలుచుకున్నారు. ఆయన తండ్రి ఇటలీకి చెందిన వ్యక్తి కాగా తల్లి రష్యన్. నికోలా 1933లో జన్మించారు.
News December 1, 2025
ఇంట్లో గణపతి విగ్రహం ఉండవచ్చా?

గృహంలో వినాయకుడి ప్రతిమను నిరభ్యంతరంగా ప్రతిష్ఠించవచ్చని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇష్ట దైవాలు, కుల దేవతల విగ్రహాలతో పాటు గణపతి విగ్రహాన్ని కూడా పూజా మందిరంలో పెట్టవచ్చు అని చెబుతున్నారు. అయితే, నవ గ్రహాలు, ఉగ్ర దేవతా మూర్తుల విగ్రహాలు లేదా చిత్ర పటాలు పూజా గదిలో లేకుండా చూసుకోవడం ఉత్తమమని వివరిస్తున్నారు. వాస్తు ప్రకారం.. గణపతి విగ్రహం ఉంటే ఎలాంటి దోషం ఉండదంటున్నారు.<<-se>>#Vasthu<<>>


