News December 3, 2024
వేల ఏళ్ల చరిత్ర కలిగిన హనుమాన్ ఆలయాలివే!

దేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన హనుమాన్ ఆలయాలున్నాయి. అందులో కొన్నింటి గురించి తెలుసుకుందాం. * రాజస్థాన్ అల్వార్ జిల్లాలోని పాండుపోల్ హనుమాన్ టెంపుల్‌కు 5000 ఏళ్ల చరిత్ర ఉంది. * UPలోని బృందావన్‌లో 3500 ఏళ్ల చరిత్ర కలిగిన లుటేరియా హనుమాన్ మందిర్. * యూపీలోని ఝాన్సీలో గ్వాలియర్ రోడ్ సమీపంలో ఉన్న సఖీ కే హనుమాన్ టెంపుల్. 500 ఏళ్ల చరిత్ర కలిగిన ఈ ఆలయాన్ని దర్శిస్తే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం.
Similar News
News April 1, 2026
‘మీ సేవ’ ఛార్జీల పెంపు

TG: ‘మీ సేవ’ కేంద్రాల ద్వారా అందించే వివిధ ధ్రువపత్రాలు, ఇతర సేవలకు ప్రభుత్వం ఛార్జీలు పెంచింది. నేటి నుంచే అవి అమల్లోకి వచ్చాయి. ఇప్పటివరకు రూ.35గా ఉన్న కనీస ఛార్జీని రూ.62కి పెంచింది. A కేటగిరీ సేవలకు రూ.62 చొప్పున, B కేటగిరీ సర్వీసులకు రూ.80 చొప్పున రుసుమును నిర్ణయించింది. B- కేటగిరీలో కమ్యూనిటీ, ఇన్‌కమ్, రెసిడెన్స్, రేషన్ కార్డు, OBC, EWS సర్టిఫికెట్, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ తదితర సేవలున్నాయి.
News April 1, 2026
ఇరాన్ యుద్ధం.. అమెరికాతో విభేదించిన బ్రిటన్

ఇరాన్ యుద్ధం విషయంలో <<19525908>>అమెరికా<<>>తో బ్రిటన్ విభేదించింది. ఈ ఘర్షణల్లోకి ప్రవేశించేది లేదని PM స్టార్మర్ తేల్చి చెప్పారు. యుద్ధంతో సంబంధం లేనప్పటికీ.. తమ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ఘర్షణల్ని ఆపేందుకు తమవంతు ప్రయత్నం చేస్తున్నామన్నారు. హార్ముజ్ పున:ప్రారంభానికి ఉన్న మార్గాల్ని అన్వేషించేందుకు గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తామని తెలిపారు.
News April 1, 2026
7.30 గంటల నిడివితో ధురంధర్!

కంటెంట్, అధిక రన్ టైమ్‌తో ప్రేక్షకులను థ్రిల్ చేసిన ‘ధురంధర్’ మేకర్స్ మరో సంచలనానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రెండు పార్టులు కలిపి 7 గంటల 30 నిమిషాల నిడివితో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన CBFC సర్టిఫికెట్ SMలో వైరలవుతోంది. OTTలో విడుదల చేస్తారా? థియేటర్లలో స్పెషల్ షోలు వేస్తారా? అనేది క్లారిటీ లేదు. గతేడాది ‘బాహుబలి: ది ఎపిక్’ 3 గంటల 44 నిమిషాలతో రిలీజైన విషయం తెలిసిందే.


