News September 23, 2024

హనుమంతుడే పంపాడేమో!.. ఆరేళ్ల బాలికను అత్యాచారం నుంచి కాపాడిన కోతులు

image

UPలోని బాఘ్‌పట్‌లో ఓ కోతుల గుంపు ఆరేళ్ల బాలికను అత్యాచారం నుంచి కాపాడింది. ఇంటి ముందు ఆడుకుంటున్న చిన్నారిని దుండగుడు ఓ పాడుబడ్డ ఇంట్లోకి తీసుకెళ్లి దుస్తులు తొలగించాడు. అత్యాచారం చేయబోతుండగా కోతుల గుంపు వచ్చి అతడిని తరిమి వేసింది. దీంతో అతడు ఆ బాలికను అక్కడే వదిలేసి వెళ్లిపోయాడు. ఈ ఘటనలో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.

Similar News

News December 7, 2025

పుతిన్ వెళ్లారు.. జెలెన్‌స్కీ వస్తున్నారు!

image

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 2 రోజుల ఇండియా టూర్ ముగిసిన వెంటనే, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ భారత పర్యటనకు సంబంధించిన తేదీలపై ఢిల్లీ కసరత్తు మొదలుపెట్టింది. రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో ఇరుపక్షాలతో సమానంగా సంబంధాలు కొనసాగించే వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయమని నిపుణులు అంటున్నారు. శాంతి విషయంలో భారత్ తటస్థంగా ఉండదన్న PM మోదీ వ్యాఖ్యలు ఈ దౌత్య ధోరణికి బలం చేకూర్చాయి.

News December 7, 2025

చలికాలం.. వీళ్లు జాగ్రత్త!

image

చలికాలంలో గుండెజబ్బుల ముప్పు ఎక్కువని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. గుండెపోటు తీవ్రత సాధారణ రోజుల్లో కంటే ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. నవంబర్-ఫిబ్రవరి మధ్య హార్ట్ ఎటాక్ ఘటనలు 15-20% అధికంగా నమోదయ్యే అవకాశం ఉందని ఇండియన్ హార్ట్ అసోసియేషన్ హెచ్చరించింది. గుండె జబ్బులు, BP, షుగర్, ఇతర దీర్ఘకాలిక వ్యాధులు, ఊబకాయం ఉన్నవారు, ధూమపానం, మద్యపానం చేసే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించింది.

News December 7, 2025

సోనియా, రాహుల్ సపోర్టర్లను ఈడీ వేధిస్తోంది: డీకే శివకుమార్

image

నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియాకు తాను విరాళాలు ఇచ్చినందుకు నోటీసులతో ED వేధిస్తోందని కర్ణాటక Dy.CM డీకే శివకుమార్ ఆరోపించారు. ‘మేం పన్నులు కడుతున్నాం. మా డబ్బును ఎవరికైనా ఇచ్చే స్వేచ్ఛ మాకుంది. మమ్మల్ని హింసించడానికే PMLA కేసు నమోదు చేశారు. సోనియా గాంధీ, రాహుల్ సపోర్టర్లను వేధించడం, గందరగోళం సృష్టించడమే వారి లక్ష్యంగా కనిపిస్తోంది’ అని మండిపడ్డారు. EDకి ఇప్పటికే అన్ని వివరాలు అందజేశానన్నారు.