News October 31, 2024
చాలాకాలం తర్వాత హ్యాపీగా నిద్రపోయా: కిరణ్

చాలాకాలం తర్వాత సంతోషంగా నిద్రపోయానని టాలీవుడ్ హీరో కిరణ్ అబ్బవరం ట్వీట్ చేశారు. దీపావళిని సంతోషకరంగా మార్చినందుకు అందరికీ కృతజ్ఞతలు, శుభాకాంక్షలు చెప్పారు. కిరణ్ అబ్బవరం నటించిన ‘క’ సినిమా ఈ రోజు థియేటర్లలో రిలీజ్ అయ్యింది. ఈ మూవీకి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆయన ఈ ట్వీట్ చేశారు.
Similar News
News February 13, 2026
మున్సిపాలిటీలపై ‘హస్తం’

TG: మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార కాంగ్రెస్ ప్రతిపక్షాలకు అందనంత దూరంలో నిలిచింది.
➤ మున్సిపాలిటీలు..
* కాంగ్రెస్ – 64
* బీఆర్ఎస్ – 15
* హంగ్ – 36
* ఇతరులు – 1, * బీజేపీ – 0
➤ వార్డులు * కాంగ్రెస్ – 1346, బీఆర్ఎస్ – 723, బీజేపీ – 261, ఇతరులు – 252
News February 13, 2026
బంగ్లాలో అధికారంలోకి BNP.. భారత్‌కు తొలి అభ్యర్థన!

భారత్‌లో ఆశ్రయం పొందుతున్న బంగ్లా మాజీ PM హసీనాను అప్పగించమని కోరతామని అక్కడి తాజా ఎన్నికల్లో గెలుపొందిన BNP ప్రకటించింది. ఇప్పటికే ఆ మేరకు అభ్యర్థనలు పంపిన విషయాన్ని గుర్తు చేసింది. పొరుగుదేశాలతో సత్సంబంధాలు కోరుకుంటున్నామని, విదేశాంగ శాఖల స్థాయిలో దీని పరిష్కారానికి తమ ప్రభుత్వం ప్రయత్నిస్తుందని స్పష్టం చేసింది. 2024 ఆగస్టులో భారత్‌కు వచ్చిన హసీనాకు బంగ్లాలోని ICJ కోర్టు మరణశిక్ష విధించింది.
News February 13, 2026
YCPని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది: పవన్ ఎద్దేవా

AP: అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగిస్తున్న సమయంలో వైసీపీ నేతలు వెల్‌లోకి దూసుకొచ్చి రభస చేయడంపై Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. కాగితాలు చించి విసరడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అసెంబ్లీలో 151 సీట్ల నుంచి 11 స్థానాలకు పడిపోయిన YCPని చూసి ఏం చేయకూడదో, ఏం చేయాలో వంటి చాలా విషయాలు నేర్చుకోవాల్సి ఉందని ఎద్దేవా చేశారు. గవర్నర్ ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై పవన్ కళ్యాణ్ మాట్లాడారు.


