News May 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 13, 2026

గ్యాస్ దొరకట్లేదా.. ఈ నంబర్‌కు కాల్ చేయండి

image

TG: గ్యాస్ లభ్యతపై ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ ‘1967’ అనే టోల్ ఫ్రీ నంబర్‌ను తీసుకొచ్చింది. LPG సిలిండర్ లభ్యతలో సమస్యలు, వీటిని అక్రమంగా కమర్షియల్ యూజ్ చేస్తున్నా ఈ నంబర్‌కు కాల్ చేసి చెప్పొచ్చని తెలిపింది. పౌర సరఫరాలకు సంబంధించి ఏ ఇతర సమస్యలు ఉన్నా దీనిని సంప్రదించొచ్చని పేర్కొంది. కాగా డొమెస్టిక్ సిలిండర్ల దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

News March 13, 2026

వారసత్వ స్థలాలకు సెల్ఫ్ డిక్లరేషన్ చాలు!

image

AP: వారసత్వంగా లభించే వ్యవసాయేతర స్థలాల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నూతన మార్గదర్శకాలు విడుదల చేసింది. ఇకపై గ్రామాల్లోని ఇలాంటి స్థలాల రిజిస్ట్రేషన్‌కు రెవెన్యూ శాఖ సర్టిఫికెట్ అవసరం లేదు. యజమానుల సెల్ఫ్ డిక్లరేషన్ సరిపోతుంది. తమకు పూర్వీకుల నుంచే ఆస్తి వచ్చిందని, నిషేధిత జాబితా(22A)లో లేదని, తామే పూర్తి హక్కుదారు అని అందులో స్పష్టంగా పేర్కొనాలి. తప్పుడు సమాచారం ఇస్తే చర్యలు తప్పవు.

News March 13, 2026

కల్తీ పాల ఘటనలు.. FSSAI కీలక ఆదేశాలు

image

దేశంలో <<19323083>>కల్తీ పాల<<>> ఘటనలు వెలుగు చూస్తుండటంతో FSSAI కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇకపై డెయిరీ కోఆపరేటివ్ సొసైటీల సభ్యులు మినహా పాల ఉత్పత్తిదారులు, విక్రయదారులు కచ్చితంగా రిజిస్ట్రేషన్/లైసెన్స్ సర్టిఫికెట్ కలిగి ఉండాలని స్పష్టం చేసింది. రాష్ట్రాల అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాలని సూచించింది. సర్టిఫికెట్ లేకుండా వ్యాపారాలు చేస్తున్నవారిపై కఠినంగా వ్యవహరించాలని తేల్చిచెప్పింది.