News May 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 9, 2025

సంజూకు మళ్లీ నిరాశేనా!

image

SAతో వన్డేల్లో చోటు దక్కని సంజూ శాంసన్‌కు T20ల్లోనూ మొండిచేయి ఎదురయ్యే ఆస్కారముంది. గాయాల నుంచి కోలుకున్న గిల్, పాండ్య జట్టుతో చేరనున్నట్లు కెప్టెన్ సూర్య ప్రకటించారు. దీంతో అభిషేక్‌తో కలిసి గిల్ ఓపెనింగ్ చేయనున్నారు. వికెట్ కీపర్‌గా జితేశ్‌ను తీసుకోవడానికే ఎక్కువ అవకాశాలున్నాయి. ప్రాబబుల్ ప్లేయింగ్ 11.. సూర్య(C), గిల్(VC), అభిషేక్, తిలక్, పాండ్య, దూబే, అక్షర్, జితేశ్, బుమ్రా, వరుణ్, కుల్దీప్

News December 9, 2025

సంక్రాంతి నుంచి సేవలన్నీ ఆన్‌లైన్‌లోనే: CM

image

AP: ప్ర‌జ‌ల‌కు కావాల్సిన ప్ర‌భుత్వ సేవ‌ల‌న్నీ సంక్రాంతి నుంచి ఆన్‌లైన్‌లోనే అందించాలని అధికారులను CM చంద్రబాబు ఆదేశించారు. RTGSపై సమీక్షలో మాట్లాడుతూ ‘వాట్సాప్ గ‌వ‌ర్నెన్స్‌పై విస్తృతంగా ప్రచారం చేయాలి. రిజిస్ట్రేష‌న్ల తర్వాత డాక్యుమెంట్లను నేరుగా ఇళ్లకే పంపించాలి. RTC బ‌స్టాండ్లు, టాయ్‌లెట్ల వ‌ద్ద పరిశుభ్ర‌తను మెరుగుపర్చాలి. రైతులకు డ్రోన్ల వినియోగంపై అవగాహన కల్పించాలి’ అని సూచించారు.

News December 8, 2025

GHMCలో వార్డుల సంఖ్య రెట్టింపు

image

TG: GHMCలో వార్డుల సంఖ్యను 150 నుంచి 300కు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులిచ్చింది. గ్రేటర్ హైదరాబాద్‌లో 7 కార్పొరేషన్లు, 20 మున్సిపాలిటీలను ఇటీవల విలీనం చేసిన విషయం తెలిసిందే. దీంతో వార్డుల సంఖ్య డబుల్ అయ్యింది. ఈ విస్తరణతో 2,735 చదరపు కి.మీతో దేశంలోనే అతిపెద్ద నగరంగా హైదరాబాద్ అవతరించనుంది.