News May 24, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 12, 2025
ఒకే వేదికపైకి రష్మిక, విజయ్..! అధికారికంగా ప్రకటిస్తారా?

ప్రేమ, త్వరలో పెళ్లి వార్తల వేళ హీరోయిన్ రష్మిక మందన్న, హీరో విజయ్ దేవరకొండ ఇవాళ ఒకే వేదికపై కనిపించనున్నట్లు తెలుస్తోంది. రష్మిక నటించిన ‘ది గర్ల్ఫ్రెండ్’ మూవీ సక్సెస్ మీట్ హైదరాబాద్లో జరగనుంది. దీనికి విజయ్ చీఫ్ గెస్ట్గా వస్తారని సమాచారం. ఈ వేదికగా తమ పెళ్లి గురించి అధికారికంగా ప్రకటిస్తారేమోనని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News November 12, 2025
బిలియనీర్ల అడ్డా ముంబై, ఢిల్లీ!

ప్రపంచంలో ఎక్కువ మంది బిలియనీర్లు ఉండే టాప్-10 నగరాల జాబితాలో ముంబై, ఢిల్లీ చోటు దక్కించుకున్నాయి. 119 మంది కుబేరులతో న్యూయార్క్ టాప్లో ఉందని హురున్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక వెల్లడించింది. ఆ తర్వాత లండన్(97), ముంబై(92), బీజింగ్(91), షాంఘై(87), షెంజెన్(84), హాంకాంగ్(65), మాస్కో(59), ఢిల్లీ(57), శాన్ఫ్రాన్సిస్కో(52) ఉన్నాయి.
News November 12, 2025
IPPB 309 పోస్టులకు నోటిఫికేషన్

ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్(IPPB)309 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు DEC 1వరకు అప్లై చేసుకోవచ్చు. Jr అసోసియేట్ పోస్టుకు 20-32 ఏళ్ల మధ్య , Asst.మేనేజర్ పోస్టుకు 20-35ఏళ్ల మధ్య ఉండాలి. డిగ్రీలో సాధించిన మెరిట్/ఆన్లైన్ పరీక్ష/గ్రూప్ డిస్కషన్/ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.


