News May 26, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 7, 2025
సేంద్రియ ఎరువులతో సాగుకు లాభం

సేంద్రియ ఎరువులు నేల భౌతిక లక్షణాలను మెరుగుపరుస్తాయి. మొక్కలకు అవసరమైన ముఖ్యమైన పోషకాలు తగిన మోతాదులో అందుతాయి. సేంద్రియ పదార్ధాలు భూమిలో మరింత మార్పుచెంది హ్యూమస్ అనే విలువైన పదార్థం తయారవుతుంది. ఇది పోషకాలను అధికంగా పట్టిఉంచి మొక్కకు సమర్ధవంతంగా అందిస్తుంది. సేంద్రియ ఎరువుల వాడకంతో నేలలో మొక్కలకు హాని కలిగించే శిలీంధ్రాలు, నులిపురుగుల ఉద్ధృతి, చీడపీడల తాకిడి తగ్గుతుందంటున్నారు నిపుణులు.
News December 7, 2025
నా పెళ్లి క్యాన్సిల్ అయింది: స్మృతి

తన పెళ్లి క్యాన్సిల్ అయిందని క్రికెటర్ <<18479493>>స్మృతి<<>> మంధాన ప్రకటించారు. ‘గత కొన్ని వారాలుగా నా జీవితంపై ఎన్నో వదంతులు వస్తున్నాయి. నా పెళ్లి క్యాన్సిల్ అయిందని క్లారిటీ ఇస్తున్నా. నేను ఈ మ్యాటర్ను ఇంతటితో వదిలేస్తున్నా. మీరూ నాలాగే చేయండి. ఇరు కుటుంబాల ప్రైవసీని గౌరవించాలని రిక్వెస్ట్ చేస్తున్నా. ఇండియా తరఫున ఆడుతూ ఎన్నో ట్రోఫీలు గెలవడమే నా లక్ష్యం’ అని ఇన్స్టాలో పోస్ట్ చేశారు.
News December 7, 2025
ఉప్పల్లో మెస్సీ మ్యాచ్కు పకడ్బందీ ఏర్పాట్లు

TG: ఈనెల 13న ఉప్పల్ స్టేడియంలో లియోనెల్ మెస్సీ-CM రేవంత్ రెడ్డి ఫ్రెండ్లీ <<18413680>>మ్యాచ్<<>> ఆడనున్న విషయం తెలిసిందే. దీనిని చూసేందుకు దేశం నలుమూలల నుంచి అభిమానులు రానున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. మ్యాచ్ ఏర్పాట్లు, భద్రతా చర్యలను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రత్యేక భద్రతా వ్యవస్థ అమలు చేస్తున్నట్లు చెప్పారు. నిర్ణీత సమయానికి ముందే ప్రేక్షకులు స్టేడియానికి చేరుకోవాలని సూచించారు.


