News March 23, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 4, 2026

పసి ప్రాణం తీసిన దుప్పటి.. తల్లి ప్రేమకు మిగిలింది కన్నీళ్లే!

image

వారణాసి (UP)లో గుండెల్ని పిండేసే విషాదం జరిగింది. రాహుల్ కుమార్, సుధా దేవి దంపతులకు 25 రోజుల క్రితం పుట్టిన పసికందు చలి తీవ్రతకు బలైంది. గడ్డకట్టే చలి నుంచి కాపాడాలని తనతో పాటు బిడ్డకూ మందమైన దుప్పటి కప్పి పడుకున్నారు. దీంతో ఊపిరాడక ఆ చిన్నారి తెల్లారేసరికి ప్రాణాలు కోల్పోవడం అందరినీ కలచివేస్తోంది. పెళ్లైన 2ఏళ్లకు పుట్టిన తొలి బిడ్డ కళ్లముందే విగతజీవిగా మారడంతో ఆ తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.

News January 4, 2026

రెయిన్‌బో బేబీ అంటే ఏంటో తెలుసా?

image

వివిధ కారణాల వల్ల కొందరు పేరెంట్స్ ముందు బిడ్డను/బిడ్డలను కోల్పోతారు. ఆ తర్వాత పుట్టేవారిని రెయిన్‌బో బేబీ అంటారు. వైద్యులు ఈ రెయిన్‌బో బేబీస్ విషయంలో కాస్త ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. వీరిని కొంతకాలం ఆసుపత్రిలో ఉంచాల్సి రావచ్చు. ఇంద్రధనస్సు అనేది వర్షం తర్వాత కనిపించే అందమైన రంగుల సమ్మేళనం. అలాగే ఈ బేబీస్ తల్లిదండ్రులకు కొత్త జీవితాన్ని, ఆనందాన్ని ఇస్తారు. అందుకే వారిని రెయిన్‌బో బేబీస్ అంటారు.

News January 4, 2026

విమానాల్లో పవర్ బ్యాంక్ వినియోగంపై నిషేధం

image

లిథియం బ్యాటరీల వల్ల అగ్నిప్రమాదాలు సంభవించే ముప్పు ఉండటంతో విమాన ప్రయాణంలో పవర్ బ్యాంక్‌ల ద్వారా ఛార్జింగ్ చేయడాన్ని DGCA నిషేధించింది. పవర్ బ్యాంకులు, పోర్టబుల్ ఛార్జర్లు విమానాల్లో మంటలకు కారణమయ్యే అవకాశం ఉందని తాజా సర్క్యులర్‌లో పేర్కొంది. ముఖ్యంగా వీటిని ఓవర్‌హెడ్ బిన్లలో ఉంచినప్పుడు పొగ లేదా మంటలను గుర్తించడం కష్టమవుతుందని, ఇది విమాన భద్రతకు పెను ప్రమాదమని హెచ్చరించింది.