News June 19, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి
Similar News
News November 28, 2025
మన ఆత్మలోనే వేంకటేశ్వరుడు

పూతాత్మా పరమాత్మా చ ముక్తానాం పరమాగతిః|
అవ్యయః పురుషః సాక్షీ క్షేత్రజ్ఞో క్షర ఏవ చ||
విష్ణుమూర్తి ఆత్మ స్వరూపుడు. ముక్తి పొందిన జీవులకు శాశ్వత గమ్యం ఆయనే. ఆ దేవుడు ప్రతి శరీరంలో ఉంటాడు. లోపల జరిగే ప్రతి విషయాన్ని సాక్షిగా చూస్తుంటాడు. కానీ, మనం ఎక్కడెక్కడో వెతుకుతుంటాం. ఆ దేవుడు బయటెక్కడో లేడు, మన అంతరాత్మలోనే ఉన్నాడని ఈ శ్లోకం వివరిస్తోంది. ఆయనే మోక్షాన్ని ఇస్తాడని నమ్మకం. <<-se>>#VISHNUSAHASRANAMAM<<>>
News November 28, 2025
HYD మెట్రోకు 8 ఏళ్లు

TG: రాష్ట్రానికే తలమానికంగా నిలిచిన HYD మెట్రో మొదలై నేటితో 8 ఏళ్లు పూర్తయ్యాయి. 2017 నవంబర్ 28న PM మోదీ ఫస్ట్ ఫేజ్ను ప్రారంభించగా 29 నుంచి సేవలు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం 3 కారిడార్లలో రోజూ 57 రైళ్లు దాదాపు 1,100 ట్రిప్పులు తిరుగుతూ ప్రజలకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నాయి. నిత్యం 4-5లక్షల మందిని గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ మెట్రోను మరింత విస్తరించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
News November 28, 2025
జనవరి 1న లొంగిపోతాం: మావోయిస్టు పార్టీ

2026 జనవరి 1న సాయుధ పోరాటం ఆపేస్తామని మావోయిస్టు పార్టీ ప్రకటన చేసింది. ఆరోజు అందరం లొంగిపోతామని MCC జోన్ ప్రతినిధి అనంత్ పేరిట లేఖ విడుదల చేసింది. జనజీవన స్రవంతిలో కలిసేందుకు కొంత సమయం కావాలని కేంద్రానికి ఇటీవల లేఖ రాసిన విషయం తెలిసిందే. టాప్ కమాండర్లు మల్లోజుల, ఆశన్న లొంగుబాటు, హిడ్మా ఎన్కౌంటర్తో మావోయిస్టు పార్టీ బలహీనమైంది. మిగతావారు లొంగిపోవాలన్న కేంద్రం విజ్ఞప్తితో ఈ నిర్ణయం తీసుకుంది.


