News March 27, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News January 28, 2026
MBNR: కాంగ్రెస్‌కు మున్సిపల్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలి: శ్రీనివాస్ గౌడ్

అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ పిలుపునిచ్చారు. మహబూబ్‌నగర్ బీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు సమష్టిగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. ఈ భేటీలో ఎన్నికల పరిశీలకులు అలీ మస్కతి పాల్గొన్నారు.
News January 28, 2026
‘నాన్నా.. నేను విమానంలో అజిత్ పవార్‌తో వెళ్తున్నా’

విమాన ప్రమాదంలో అజిత్ పవార్‌తోపాటు ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి కూడా చనిపోయారు. ముంబైకి చెందిన పింకీ చివరిసారిగా తన తండ్రి శివకుమార్‌తో ఫోన్‌లో మాట్లాడారు. ‘నాన్నా నేను అజిత్ పవార్‌తో కలిసి విమానంలో బారామతి వెళ్తున్నా. అక్కడి నుంచి నాందేడ్ వెళ్లి మీతో రేపు మాట్లాడుతా’ అని చెప్పినట్లు శివ తెలిపారు. తన కూతురిని కోల్పోయానని, ఆమె మృతదేహాన్ని తెస్తే అంత్యక్రియలు నిర్వహిస్తానని కన్నీళ్లుపెట్టుకున్నారు.
News January 28, 2026
నం.1లో అభిషేక్.. టాప్-10లోకి సూర్య

NZతో జరుగుతున్న సిరీస్‌లో రాణిస్తున్న ఓపెనర్ అభిషేక్ శర్మ టీ20 ICC ర్యాంకింగ్స్‌లో 929 పాయింట్లతో నం.1 స్థానంలో కొనసాగుతున్నారు. రెండో స్థానంలో ఉన్న సాల్ట్‌కు అతనికి 80 పాయింట్ల గ్యాప్ ఉంది. మరోవైపు ఇదే సిరీస్‌లో ఫామ్ అందుకున్న కెప్టెన్ SKY 5 స్థానాలు ఎగబాకి నం-7లోకి వచ్చారు. అటు తిలక్ మూడో స్థానంలో కొనసాగుతున్నారు. T20 బౌలర్లలో 787 పాయింట్లతో వరుణ్ నం.1లో స్థానంలో కంటిన్యూ అవుతున్నారు.


