News July 3, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News July 5, 2024

రాబోయే రెండేళ్లలో అదనంగా 10వేల నాన్ ఏసీ కోచ్‌లు: రైల్వే

image

రైళ్లలో సాధారణ ప్రయాణికుల ఇక్కట్లను తీర్చే దిశగా రైల్వే మంత్రిత్వ శాఖ సన్నాహాలు చేస్తోంది. పెరుగుతున్న డిమాండ్‌‌ను తీర్చేందుకు రాబోయే రెండేళ్లలో 10వేల నాన్-ఏసీ కోచ్‌ల తయారీ‌కి ప్రణాళికలు రూపొందించింది. 2024-25లో 4,485 కోచ్‌లు, 2025-26లో 5,444 కోచ్‌లు తయారు చేయనున్నట్లు రైల్వే అధికారి తెలిపారు. దీనికి అదనంగా మరో 5,300 జనరల్ కోచ్‌లు రూపొందించాలని యోచిస్తోంది.

News July 5, 2024

కస్టమర్ల డేటా లీక్.. ఖండించిన ఎయిర్‌టెల్

image

తమ కస్టమర్ల డేటా హ్యాక్ కాలేదని టెలికాం సంస్థ ఎయిర్‌టెల్ స్పష్టం చేసింది. తమ ప్రతిష్ఠ దిగజార్చడానికే కొంతమంది కుట్ర పన్నుతున్నారని ఆరోపించింది. తమ సెక్యూరిటీ వ్యవస్థలోకి ఇప్పటివరకు ఎవరూ చొరబడిన ఆనవాళ్లు లేవని పేర్కొంది. డేటా భద్రతలో ఎలాంటి లొసుగులు లేవని తేల్చిచెప్పింది. కాగా ఓ హ్యాకర్ ఎయిర్‌టెల్ కస్టమర్లకు సంబంధించిన డేటాను ఆన్‌లైన్‌లో రూ.50 వేల డాలర్లకు అమ్మకానికి పెట్టినట్లు వార్తలు వచ్చాయి.

News July 5, 2024

కొలెస్ట్రాల్ తగ్గించే ఇంజెక్షన్లు ఇన్సూరెన్స్‌లో కవర్ అవుతాయా?

image

కొలెస్ట్రాల్ తగ్గించే కాస్ట్లీ ఇంజెక్షన్లు భారత్‌లోనూ రానున్న నేపథ్యంలో ఇవి ఇన్సూరెన్స్‌ పరిధిలోకి వస్తాయా? లేదా? అనేది చర్చనీయాంశమైంది. ‘కేంద్రం ఆమోదంతో ఈ చికిత్స హెల్త్ ఇన్సూరెన్స్ పరిధిలోకి వచ్చినా ఆస్పత్రి ఖర్చులే కవర్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇంజెక్షన్ ఖర్చును (₹1.25లక్షలు) పేషెంటే భరించాలి. చికిత్సకు ముందు మీ ఇన్సూరర్‌ను సంప్రదించడం లేదా పాలసీ చెక్‌ చేసుకోవడం మంచిది’ అని నిపుణులు సూచిస్తున్నారు.