News July 8, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 26, 2025

ఈ రెస్టారెంట్లో సింగిల్స్‌కు నో ఎంట్రీ!

image

దక్షిణ కొరియాలోని యోసు సిటీలోని ఓ రెస్టారెంట్ ఒంటరిగా వచ్చే వారికి అనుమతి లేదని ప్రకటించడం వివాదానికి దారితీసింది. సింగిల్‌ కస్టమర్లు ఇద్దరికి భోజనం కొనాలని లేదా ఫ్రెండ్‌/భార్యతో రావాలంటూ నిబంధనలు పెట్టింది. కొంతకాలంగా కొరియాలో “హోన్‌బాప్” అనే పేరుతో ఒంటరిగా తినే ట్రెండ్ పెరుగుతోంది. ఒంటరిగా తినడం ఒంటరితనం కాదని పలువురు అభిప్రాయపడుతుండగా, కొందరు ఈ నిర్ణయాన్ని సపోర్టు చేస్తున్నారు.

News November 26, 2025

బెట్టింగ్‌లతో అప్పులు.. గన్ తాకట్టు పెట్టిన ఎస్ఐ!

image

TG: హైదరాబాద్ అంబర్‌పేట్ SI గన్ మిస్సింగ్ వ్యవహారం కలకలం రేపింది. ఓ కేసులో రికవరీ చేసిన బంగారంతోపాటు తన సర్వీస్ గన్‌ను SI భాను ప్రకాశ్ తాకట్టు పెట్టినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేశారని, బెట్టింగ్‌లో రూ.80 లక్షలు పోగొట్టుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలోనే బంగారం, తుపాకీ తాకట్టు పెట్టారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం భాను ప్రకాశ్‌ను టాస్క్‌ఫోర్స్ అదుపులోకి తీసుకుని విచారణ జరుపుతోంది.

News November 26, 2025

BELOPలో ఉద్యోగాలకు దరఖాస్తుల ఆహ్వానం

image

BEL ఆప్ట్రోనిక్ డివైసెస్ లిమిటెడ్(<>BELOP<<>>)5 ఇంజినీర్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు నేటి నుంచి డిసెంబర్ 20 వరకు అప్లై చేసుకోవచ్చు. BE, B.Tech (ఎలక్ట్రానిక్స్ ,ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, E&TC, మెకానికల్ ) ఉత్తీర్ణులైన, 30ఏళ్లలోపు గలవారు అర్హులు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్:https://bel-india.in