News July 9, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News September 19, 2025

అమెరికాలో గొడవ.. పోలీసుల కాల్పుల్లో తెలుగు యువకుడు మృతి

image

మహబూబ్‌నగర్‌ (TG)కు చెందిన నిజాముద్దీన్ (32) అమెరికా పోలీసుల కాల్పుల్లో మరణించిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. MS చేసేందుకు 2016లో USకు వెళ్లిన అతడు జాబ్ లేకపోవడంతో కాలిఫోర్నియాలో స్నేహితులతో కలిసి ఉంటున్నాడు. ‘రూమ్‌మేట్స్ మధ్య గొడవ జరుగుతోందని SEP 3న కాల్ వచ్చింది. నిజాముద్దీన్ ఒకరిపై కత్తితో దాడి చేస్తున్నాడు. కంట్రోల్ చేసేందుకు కాల్పులు జరిపాం. గాయాలతో అతడు మరణించాడు’ అని పోలీసులు తెలిపారు.

News September 19, 2025

కార్ల ధరలు తగ్గించిన మారుతి సుజుకీ

image

కొత్త GST రేట్ల నేపథ్యంలో మారుతి సుజుకి కార్ల ధరలను తగ్గించింది. S-ప్రెసోపై రూ.1,29,600, ఆల్టో K10పై రూ.1,07,600, సెలేరియోపై రూ.94,100, డిజైర్‌పై రూ.87,700, వ్యాగన్-Rపై రూ.79,600, ఇగ్నిస్‌పై రూ.71,300, స్విఫ్ట్‌పై రూ.84,600, బాలెనోపై రూ.86,100, ఫ్రాంక్స్‌పై రూ.1,12,600, బ్రెజ్జాపై రూ.1,12,700, గ్రాండ్ విటారాపై రూ.1,07,000, జిమ్నీపై రూ.51,900, ఎర్టిగాపై రూ.46,400 మేర ధరలు తగ్గించింది.

News September 19, 2025

బ్రేక్ ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారా?

image

రోజులో చాలా ముఖ్యమైన మీల్ బ్రేక్‌ఫాస్ట్. కానీ, చాలామంది దానిని స్కిప్ చేస్తుంటారు. నైట్ ఎక్కువ తిన్నారనో, బరువు తగ్గాలనో కారణం ఏదైనా టిఫిన్ చేయడం మానేస్తారు. దాంతో మెదడుకు కావాల్సిన ఎనర్జీ దొరక్క ఏకాగ్రత లోపిస్తుంది. బ్లోటింగ్, అజీర్తి, గుండె సమస్యలు వస్తాయి. బరువు కూడా పెరుగుతారు. మరోవైపు టిఫిన్ ఆలస్యంగా చేస్తే ఆయుష్షు 8-10 శాతం తగ్గుతుందని మాంచెస్టర్ యూనివర్సిటీ స్టడీ చెబుతోంది. SHARE IT.