News July 15, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 5, 2025

పార్వతీపురం జిల్లాలో సీఎం షెడ్యూల్ ఇలా..!

image

భామిని ఆదర్శ పాఠశాలలో శుక్రవారం జరగనున్న మెగా PTM కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. ఉ.10:20కు భామినికి హెలిప్యాడ్‌లో చేరుకుని 10:30కు పాఠశాలకు వెళ్తారు. ఉ.10:45 వరకు పాఠశాలలో తరగతి గదులు, ల్యాబ్స్, స్పోర్ట్స్ రూమ్స్ సందర్శించి విద్యార్థులు వారి తల్లిదండ్రులతో గ్రూప్ ఫోటోలు దిగుతారు. మ.12:45 నుంచి1:25 వరకు సభలో ప్రసంగించి అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారు. మ.1:55కు తిరుగు పయనమవుతారు.

News December 5, 2025

అఖండ-2 సినిమా రిలీజ్ వాయిదా

image

నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో తెరకెక్కిన అఖండ-2 మూవీ విడుదల వాయిదా పడింది. రేపు రిలీజ్ కావాల్సిన సినిమాను అనివార్య కారణాలతో వాయిదా వేస్తున్నట్లు నిర్మాణ సంస్థ 14 రీల్స్ ప్లస్ తెలిపింది. త్వరలోనే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని ట్వీట్ చేసింది. ఈ సినిమా <<18466572>>ప్రీమియర్స్‌<<>>ను రద్దు చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటించగా తాజాగా రిలీజ్‌ను కూడా వాయిదా వేశారు.

News December 5, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను రిసీవ్ చేసుకున్న ప్రధాని మోదీ
*హార్టికల్చర్‌ హబ్‌కి కేంద్రం రూ.40వేల కోట్లు ఇస్తోంది: చంద్రబాబు
*తప్పుడు కేసులు పెడితేనే నక్సలిజం పుడుతుంది: జగన్
*ఏడాదిలోగా ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టు పనులు ప్రారంభం: రేవంత్
*’హిల్ట్’ పేరుతో కాంగ్రెస్ భూకుంభకోణం: KTR
*మరోసారి కనిష్ఠానికి రూపాయి.. అమెరికన్ డాలర్‌తో పోలిస్తే రూ.90.43కి పతనం