News July 17, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News April 4, 2026

సిటీ నుంచి ఏపీ, కర్ణాటక, మహారాష్ట్రకు కొత్త విమానాలు

image

శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఏపీలోని విజయవాడ, రాజమండ్రి, కర్ణాటకలోని హుబ్బళ్లికి ఈనెల 10 నుంచి కొత్త విమానాలు ప్రారంభం కానున్నాయి. ఫ్లై 91 సంస్థ ఈ విమాన సర్వీసులను ప్రారంభించనుంది. ప్రతి రోజూ రెండు సర్వీసులు ప్రయాణికులకు సేవలందిస్తాయి. వీటితోపాటు షోలాపూర్‌కూ సర్వీసులు నడుపుతామని కంపెనీ సీఈఓ మనోజ్ తెలిపారు.

News April 4, 2026

ఆ సమయంలో బ్రాహ్మణి బాధపడింది: లోకేశ్

image

AP: CBNను YCP Govt అరెస్టు చేసి జైల్లో పెట్టినప్పుడు కర్ణాటకలోని తెలుగు ప్రజలూ తమకు అండగా నిలిచారని మంత్రి లోకేశ్ అక్కడి సింధనూర్‌లో పేర్కొన్నారు. ఆనాడు ఎంతో వ్యథ అనుభవించామన్నారు. ‘గౌరవంతో బతికిన కుటుంబం మనది. పెద్దాయన్ను అన్యాయంగా జైల్లో పెట్టారు. ఎందుకీ పరిస్థితి. ఇలాంటి రాజకీయాలు మనకు అవసరమా? అని బ్రాహ్మణి బాధపడింది’ అని తెలిపారు. ప్రజలు వెంటే ఉన్నారని, వారికి రుణపడి ఉండాలని చెప్పానన్నారు.

News April 4, 2026

విద్యార్థుల నుంచి ఫీజుల్ని వసూలు చేసుకోవచ్చు: హైకోర్టు

image

TG: ప్రభుత్వం రీయింబర్స్‌మెంటు నిధుల విడుదలలో విఫలమైతే ఇంజినీరింగ్ కాలేజీలు 2026-27లో విద్యార్థుల నుంచి నేరుగా ఫీజులు వసూలు చేసుకోవచ్చని హైకోర్టు సూచించింది. ప్రభుత్వం నిధులు విడుదల చేశాక తిరిగి విద్యార్థులకు ఆ ఫీజుల మొత్తాలను రిఫండ్ చేయాలని ఆదేశించింది. ఫీజు రీయింబర్స్‌మెంటు బకాయిలు విడుదల చేయకపోవడంపై కాలేజీలు దాఖలు చేసిన 14 పిటిషన్లను విచారించిన కోర్టు ఈ తీర్పు ఇచ్చింది.