News July 20, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 4, 2025

సచివాలయంలో IASల ‘Speed vs Side’ వార్!

image

TG: సచివాలయంలో IASల అంతర్గత పోరు పీక్స్‌కు చేరింది. సెక్రటేరియట్‌లో 8 మంది సీనియర్ IASలతో SPEED పేరిట ఓ గ్రూప్ క్రియేట్ అయింది. CM మీటింగ్స్, కీలక అంశాలపై ఆ సభ్యులకే సమాచారం వెళ్తోందట. దీంతో ఆ గ్రూప్‌లో లేని అధికారుల్లో.. తమను పక్కనబెట్టారనే అసహనం రోజురోజుకూ పెరుగుతోందని తెలుస్తోంది. ఆ అసంతృప్త అధికారుల్లో కొందరు తమకు తెలిసిన విషయాలు లీక్ చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాలు Way2Newsకు తెలిపాయి.

News December 4, 2025

రైల్వే నాణ్యతపై ప్రయాణికులు సంతృప్తి!

image

భారతీయ రైల్వే ఏటా 58కోట్ల ప్యాక్డ్ మీల్స్‌ను ప్యాసింజర్స్‌కు అందిస్తున్నట్లు కేంద్రం వెల్లడించింది. వీటిలో నాణ్యతపై అందిన ఫిర్యాదులు 0.0008 శాతమేనని పేర్కొంది. వీటిపై విచారణ జరిపి గత నాలుగేళ్లలో రూ.2.8కోట్ల జరిమానా విధించినట్లు తెలిపింది. నాణ్యమైన ఆహారం అందించడానికి రైల్వే నిరంతరంగా కృషి చేస్తుందని స్పష్టం చేసింది. అయితే SMలో మాత్రం ఆహార నాణ్యతపై తీవ్ర అభ్యంతరాలు వస్తున్న విషయం తెలిసిందే.

News December 4, 2025

వీధికుక్కలు వెంబడిస్తే ఇలా చేయకండి!

image

బైకర్లను వీధికుక్కలు వెంబడించి భయపెట్టడం తెలిసిందే. ఈ సమయంలో కొందరు వాహనాన్ని వేగంగా నడిపి ప్రమాదానికి గురవుతుంటారు. నిన్న వరంగల్(D) మచ్చాపూర్‌లో కుక్కల భయానికి ఓ వ్యక్తి బైక్‌ను వేగంగా నడుపుతూ అదుపుతప్పి డ్రైనేజీలో పడి చనిపోయాడు. కుక్కలు వెంబడిస్తే బైక్‌ను వేగంగా నడపొద్దు. గట్టిగా అరిస్తే అవి మరింత రెచ్చిపోతాయి. రియాక్ట్ అవ్వకుండా ఉంటే అవి సైలెంట్ అవుతాయి. వాటి కళ్లలోకి నేరుగా చూడకండి.