News July 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News April 7, 2026

ఆరో తరగతి చదివిన TN అభ్యర్థికి రూ.వెయ్యికోట్ల ఆస్తి!

image

తమిళనాడు ఎన్నికల బరిలో లాటరీ కింగ్ శాంటియాగో మార్టిన్ భార్య, AIADMK అభ్యర్థి లీమా రోజ్ మార్టిన్ అత్యంత ధనిక అభ్యర్థిగా నిలిచారు. తన అఫిడవిట్‌లో రూ.1,041 కోట్ల నికర ఆస్తులు, రూ.8.57కోట్ల అప్పులున్నట్లు ఆమె ప్రకటించారు. ఇందులో రూ.910 కోట్ల విలువైన భూములు, భవనాలు ఉన్నాయి. ఆరో తరగతి వరకు మాత్రమే చదివిన లీమాకు బంగారం, వజ్రాలు, షేర్లలోనూ భారీగా పెట్టుబడులున్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.

News April 7, 2026

పాక్.. ముందు మీ పరిస్థితి చక్కదిద్దికో!

image

హార్ముజ్ నుంచి నౌకలు రాక దేశంలో ఇంధన కొరత ఏర్పడి పాక్షిక <<19590326>>లాక్‌డౌన్<<>> విధించిన పాకిస్థాన్.. భారత్‌లోని <<19571096>>కోల్‌కతా<<>> వరకు వస్తామంటూ బీరాలు పలకడం హాస్యాస్పదం. ‘ముందు మీ నౌకలు రప్పించుకోండి. భారీగా పెరిగిన పెట్రోల్ రేట్లను తగ్గించుకోండి. తర్వాత మా దేశానికి రావొచ్చు. అయినా మీకు మరోసారి అలాంటి ఆలోచన రాకుండా IND బుద్ధి చెబుతుంది’ అని కొందరు నెటిజన్లు SMలో కామెంట్స్ చేస్తున్నారు. పాక్ తీరుపై మీరేమంటారు?

News April 7, 2026

మణిపుర్‌లో మళ్లీ హింస.. ఇంటర్నెట్ బంద్

image

ఈశాన్య రాష్ట్రమైన మణిపుర్‌లో మరోసారి ఉద్రిక్తత నెలకొంది. మోయిరాంగ్ వ్యాలీలో ఓ ఇంటిపై జరిగిన దాడిలో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఘటనపై స్థానికంగా నిరసనలు చెలరేగాయి. అధికారులతో జరిగిన ఘర్షణల్లో 19 మందికిపైగా గాయపడ్డారు. ఇది మిలిటెంట్లు చేసిన రాకెట్ దాడిగా అధికారులు అనుమానిస్తున్నారు. ఐదు జిల్లాల్లో ఇంటర్నెట్ బంద్ చేయడం సహా ఘటన జరిగిన బిష్ణుపుర్‌లో కర్ఫ్యూ విధించారు.