News August 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 2, 2025

క్రమబద్దీకరణ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి: కలెక్టర్

image

పట్టణ ప్రాంతాలలో అనధికార లే అవుట్లు, ఆక్రమణలను తొలగించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్‌లో ఆయన మున్సిపల్ కమిషనర్లతో సమీక్షించారు. అనధికార ఆక్రమణలను లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం మార్చి వరకు గడువు ఇచ్చిందన్నారు. ఈ లోపు అక్రమ కట్టడాలను క్రమబద్దీకరించుకోవాలన్నారు.

News December 2, 2025

EPS-95 పెన్షన్ పెంపుపై కేంద్రం క్లారిటీ

image

EPFO కింద కవరయ్యే EPS-95 పెన్షన్‌‌ను రూ.1000 నుంచి రూ.7,500కు పెంచాలన్న డిమాండ్‌ను కేంద్రం తోసిపుచ్చింది. ఆ ప్రతిపాదన లేదని తేల్చి చెప్పింది. 2019 మార్చి 31నాటికి ఫండ్ విలువలో యాక్చురియల్ లోటుందని తెలిపింది. అంటే పెన్షన్ చెల్లించేందుకు సరైన రాబడి లేదు. MP సురేశ్ గోపీనాథ్ మాత్రే లోక్‌సభలో అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి శోభా కరంద్లాజే ఈ సమాధానమిచ్చారు. ఈ స్కీమ్ కింద 80 లక్షలకుపైగా పెన్షనర్లున్నారు.

News December 2, 2025

హిందూ దేవుళ్లను రేవంత్ అవమానించారు: బండి

image

హిందువులంటే కాంగ్రెస్‌కు ద్వేషమని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. <<18447956>>CM రేవంత్<<>> హిందూ దేవుళ్లను అవమానించారని, ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు ట్వీట్ చేశారు. ‘కాంగ్రెస్ MIMకి మోకరిల్లింది. తమది ముస్లింల పార్టీ అని రేవంత్ కూడా అన్నారు. BRS కూడా హిందువులను కించపరిచింది. కానీ BJP ఇతర మతాల్ని అవమానించలేదు. హిందువులు ఇలా అవమానాన్ని భరిస్తూనే ఉంటారా లేదా ఒక్కటవుతారా’ అని పేర్కొన్నారు.