News August 7, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 13, 2026

USతో ట్రేడ్ డీల్‌ నిలిపివేత వార్తలు.. భారత్ స్పందన!

image

అమెరికాపై అధిక టారిఫ్‌లు వేస్తున్నాయంటూ భారత్, చైనా సహా 16 దేశాలపై <<19359537>>దర్యాప్తునకు<<>> ట్రంప్ ఆదేశించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో USతో ట్రేడ్ డీల్‌ను ఇండియా నిలిపేయనుందని Reuters తెలిపింది. ఒప్పందంపై సంతకం చేయకుండా కొన్ని నెలలు ఆలస్యం చేయనుందని పేర్కొంది. అయితే ఈ వార్తల్లో నిజం లేదని, పరస్పర ప్రయోజనకర ఒప్పందం కోసం రెండు దేశాల మధ్య చర్చలు జరుగుతున్నాయని కేంద్ర వాణిజ్య శాఖ తెలిపింది.

News March 13, 2026

7-8 గంటలు నిద్రపోయినా నీరసంగా ఉందా?

image

7-8 గంటలు పడుకున్నా ఉదయాన్నే నీరసంగా, తల భారంగా అనిపిస్తే అది కేవలం నిద్ర సమస్య కాకపోవచ్చునని డాక్టర్లు చెబుతున్నారు. విటమిన్ B12, ఐరన్, మెగ్నీషియం, విటమిన్ D లోపం వల్ల ఎనర్జీ తగ్గి, కండరాల రికవరీ దెబ్బతింటుంది. దీంతో నిరంతరం అలసట, మూడ్ స్వింగ్స్, మెదడు మొద్దుబారడం వంటి సమస్యలొస్తాయి. సరైన ఆహారం, సూర్యరశ్మి, తగినంత నీరు తీసుకోవడంతో పాటు టెస్ట్‌లు చేయించుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

News March 13, 2026

LPG సిలిండర్ల రవాణాకు పోలీస్ ఎస్కార్ట్

image

TG: రాష్ట్రంలో LPG సిలిండర్ల రవాణా సురక్షితంగా, సకాలంలో జరిగేలా చూసేందుకు అవసరమైన చోట పోలీసు ఎస్కార్ట్ కల్పించనున్నారు. ఇందుకోసం రాష్ట్ర, జిల్లా స్థాయి కమిటీలను ఏర్పాటు చేశారు. అవి చమురు సంస్థలతో సమన్వయం చేసుకోనున్నాయి. గోదాములు, డిస్ట్రిబ్యూటర్ల వద్ద శాంతి భద్రతల పర్యవేక్షణకు అధికారులను నియమించారు. కృత్రిమ కొరతను అరికట్టి కస్టమర్లకు ఇబ్బంది కలగకుండా చూడటమే ఈ చర్యల వెనక ఉద్దేశంగా కనిపిస్తోంది.