News August 10, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News August 31, 2025

ఫ్రీ బస్సు.. మరో శుభవార్త

image

AP: మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని గ్రౌండ్ బుకింగ్ ఉన్న బస్సుల్లో కూడా అనుమతించాలని ప్రభుత్వం RTCని ఆదేశించింది. కండక్టర్లు లేకుండా రెండు, మూడు బస్టాండ్లలో నడిచే బస్సులకు ఆయా బస్టాండ్‌లలోనే టికెట్లు ఇస్తుంటారు. ఇలాంటి పల్లెవెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్‌ల్లో ఇకపై మహిళలు ఉచితంగా వెళ్లవచ్చు. అలాగే సింహాచలం కొండతో సహా 39 ఘాట్ రోడ్లలో ప్రయాణించే బస్సుల్లోనూ ఈ స్కీం అమలుకు ఆదేశాలిచ్చారు.

News August 31, 2025

ఏడేళ్లు కనిపించకపోతే చనిపోయినట్లే: హైకోర్టు

image

TG: 21 ఏళ్ల క్రితం అదృశ్యమైన భర్త ఉద్యోగం ఇవ్వాలని క్యాన్సర్‌తో బాధపడుతున్న మహిళ పిటిషన్‌పై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. చట్టప్రకారం ఏడేళ్లు ఎవరైనా కనిపించకుండాపోతే చనిపోయినట్లేనని, వారసత్వం కింద కుటుంబానికి ఉద్యోగం ఇవ్వాలని ఇండియన్ బ్యాంకుకు సూచించింది. వారికి రావాల్సిన పదవీ తొలగింపు ప్రయోజనాలు చెల్లించాలని ఖమ్మంకు చెందిన వనపట్ల సుగుణ పిటిషన్‌పై జస్టిస్ నగేశ్ భీమపాక ఈ ఆదేశాలిచ్చారు.

News August 31, 2025

మీకు జీమెయిల్ అకౌంట్ ఉందా?

image

జీమెయిల్ అకౌంట్ యూజర్లకు గూగుల్ కీలక సూచన చేసింది. హ్యాకింగ్ అటాక్స్ నేపథ్యంలో వెంటనే పాస్‌వర్డ్స్ ఛేంజ్ చేసుకోవాలంది. థర్డ్ పార్టీ సేల్స్‌ఫోర్స్ సిస్టమ్ డేటాను తస్కరించడంతో 250కోట్ల మంది అకౌంట్స్ ప్రమాదంలో పడ్డాయని ఇటీవల గూగుల్ వెల్లడించింది. అయితే కస్టమర్ డేటాకు ప్రమాదం లేదని, కంపెనీ సేల్స్‌ఫోర్స్ సిస్టమ్‌కు ఎఫెక్ట్ ఉంటుందని పేర్కొంది. ముందు జాగ్రత్తగా పాస్‌వర్డ్ అప్డేట్ చేసుకోవాలని సూచించింది.