News August 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 7, 2026

మ్యూచువల్ ఫండ్స్, ఫిక్స్‌డ్ డిపాజిట్స్.. ఏది బెటర్?

image

ఈ ప్రశ్న తరచూ వినిపిస్తుంటుంది. నిజానికి రెండూ బెటరే. ఫిక్స్‌డ్ డిపాజిట్స్‌(FD)తో ఓ గ్యారంటీ, కంఫర్ట్ ఉంటుంది. నిర్ణీత వడ్డీ రేటుతో మెచ్యూరిటీ సమయంలో డబ్బు అందుతుంది. అదే మ్యూచువల్ ఫండ్స్(MF)ను పెద్ద కంపెనీల్లో పెట్టుబడిగా పెడతారు. దీంతో దీర్ఘకాలంలో మంచి రాబడులు అందుతాయి. FD స్క్రూడ్రైవర్ లాంటిదైతే, MF పవర్ డ్రిల్ లాంటిదని నిపుణులు చెబుతారు. రిటర్న్స్, ట్యాక్స్ వంటి విషయాల్లో MF బెటర్ ఆప్షన్.

News January 7, 2026

పోర్టు వరకు పోలవరం నావిగేషన్ కెనాల్: CBN

image

AP: ఉత్పత్తుల జలరవాణా కోసం పోలవరం నుంచి విశాఖ పోర్టువరకు నావిగేషన్ కెనాల్‌ నిర్మిస్తున్నట్లు CM CBN తెలిపారు. దీనిద్వారా MH, TG తదితర ప్రాంతాల ఉత్పత్తులను భద్రాచలం మీదుగా జలమార్గంలో తరలించవచ్చని చెప్పారు. పోర్టు ద్వారా వీటిని విదేశాలకు ఎగుమతి చేయడం సులభమవుతుందని వివరించారు. ముందు చూపుతో ఈ కెనాల్‌ను ప్రాజెక్టు ప్రణాళికలో పెట్టించినట్లు వివరించారు. విశాఖ, అనకాపల్లి జిల్లాలకు సాగు నీరందిస్తామన్నారు.

News January 7, 2026

టెన్త్ విద్యార్థులకు స్నాక్స్.. నిధులు విడుదల

image

TG: పదో తరగతి విద్యార్థులకు ఈవెనింగ్ స్నాక్స్ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.4.23కోట్ల నిధులను విడుదల చేసింది. వార్షిక పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ ఈవెనింగ్ స్నాక్స్ అందించాలని డీఈవోలను ఆదేశించింది. ఫిబ్రవరి 16 నుంచి మార్చి 10వ తేదీ వరకు వీటిని అందించాలని ఆదేశాల్లో పేర్కొంది. కాగా రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు మార్చి 14 నుంచి ఏప్రిల్ 16 వరకు జరగనున్నాయి.