News March 18, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 23, 2024

వారం రోజుల్లోనే OTTలోకి రాజమౌళి సినిమా!

image

దర్శకధీరుడు రాజమౌళిపై తెరకెక్కిన ‘RRR: Behind & Beyond’ డాక్యుమెంటరీ ఫిల్మ్ ఈనెల 20న థియేటర్లలో రిలీజైన విషయం తెలిసిందే. ఈ చిత్రానికి ఫ్యాన్స్ నుంచి మంచి రెస్పాన్స్ రాగా, ఓటీటీలో రిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 27న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ డాక్యుమెంటరీలో చరణ్, ఎన్టీఆర్‌ సీన్స్‌తో పాటు ఇతర నటీనటుల చిత్రీకరణలో జక్కన్న పడిన కష్టాన్ని చూపారు.

News December 23, 2024

భారత మాజీ క్రికెటర్ ఆరోగ్యం విషమం

image

టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆరోగ్యం మరింత క్షీణించింది. ఆయనను థానేలోని ఆకృతి ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం కాంబ్లీ పరిస్థితి క్రిటికల్‌గా ఉన్నట్లు తెలుస్తోంది. కొంతకాలంగా ఆయన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది. ఇటీవలే కాంబ్లీని ఆసుపత్రిలో చేర్పించి ట్రీట్‌మెంట్ ఇచ్చారు. తాజాగా మరోసారి ఆయన ఆసుపత్రిపాలయ్యారు. కాంబ్లీ ఆరోగ్య పరిస్థితిపై ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

News December 23, 2024

ALERT.. 3 రోజులు వర్షాలు

image

నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో రానున్న మూడ్రోజులు దక్షిణ కోస్తాలో వర్షాలు పడనున్నాయి. నెల్లూరు, ప్రకాశం, తిరుపతి సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయి. పోర్టుల్లో మూడో నంబర్ హెచ్చరికలు కొనసాగుతున్నాయి. మత్స్యకారులు గురువారం వరకు సముద్రంలో వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు.