News August 23, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News October 27, 2025

నామ జప ఫలితాన్ని తగ్గించే అపరాధాలు

image

భగవంతుని స్మరణలో భాగంగా ఆయన నామ జపం చేయడం గొప్ప పుణ్యకార్యం. అయితే శాస్త్రాల ప్రకారం.. ఆయన నామాన్ని జపించేటప్పుడు 10 రకాల అపరాధాలను చేయకూడదట. ఎంత జపం చేసినా ఈ అపరాధాలు ఉంటే ఆ నామ జపం పూర్తి ఫలితం ఎన్నటికీ లభించదు. నామ జపం అంటే.. కేవలం నామమును ఉచ్ఛరిస్తే సరిపోదు. దానిని భక్తితో, నియమబద్ధంగా చేయాలి. లేకపోతే ఆ కర్మ కేవలం శ్రమగా మిగిలిపోతుంది. ఆశించిన పుణ్యం, ఆధ్యాత్మిక లాభం సిద్ధించదు. <<-se>>#Bakthi<<>>

News October 27, 2025

శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్టులో ఉద్యోగాలు

image

కోల్‌కతాలోని శ్యాంప్రసాద్ ముఖర్జీ పోర్ట్‌ 4 ట్రెయినీ డాక్ పైలట్ పోస్టులను భర్తీ చేయనుంది. పోస్టును బట్టి బీఎస్సీ నాటికల్ సైన్స్, సెకండ్ మేట్(FG)/డ్రెడ్జ్ మేట్ గ్రేడ్ 1 అర్హతగల అభ్యర్థులు నవంబర్ 22 వరకు అప్లై చేసుకోవచ్చు. అనంతరం దరఖాస్తు హార్డ్ కాపీని స్పీడ్ పోస్ట్ చేయాలి. రాతపరీక్ష/ప్రొఫిషియెన్సీ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్‌సైట్: https://smp.smportkolkata.in/

News October 27, 2025

ఐసీయూలో శ్రేయస్ అయ్యర్

image

టీమ్ ఇండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఓ ఆస్పత్రిలో రెండ్రోజుల నుంచి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. ఆస్ట్రేలియాతో మూడో వన్డే ఆడుతున్న సమయంలో క్యాచ్ పట్టే క్రమంలో అయ్యర్ తీవ్రంగా <<18098991>>గాయపడిన<<>> విషయం తెలిసిందే. వెంటనే మైదానాన్ని వీడగా ఆస్పత్రికి తరలించారు. వైద్య పరీక్షల్లో రిబ్స్‌లో రక్తస్రావం అయినట్లు గుర్తించారు. వారం రోజుల పాటు వైద్యుల పర్యవేక్షణలో ఉంటారని క్రీడా వర్గాలు తెలిపాయి.