News August 24, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News March 30, 2026
రిలేషన్షిప్‌లో ఈ 3 తప్పులు అస్సలు చేయకండి!

మనుషుల మధ్య బంధాలు తెగిపోవడానికి పెద్ద గొడవలు అక్కర్లేదని, చిన్న అలవాట్లే చాలంటున్నారు సైకాలజిస్టులు. ముఖ్యంగా 3 అంశాలు బంధాన్ని సైలెంట్‌గా నాశనం చేస్తాయని తెలిపారు. ‘మనసు విప్పి మాట్లాడకపోవడం, గత తప్పులను పదేపదే ఎత్తిచూపడం, భాగస్వామి భావాలను నిర్లక్ష్యం చేయడం వంటివి బంధాన్ని బలహీనపరుస్తాయి. వీటివల్ల ప్రేమ తగ్గి దూరం పెరుగుతుంది. ఒకరినొకరు గౌరవించుకుంటేనే ఏ బంధమైనా నిలబడుతుంది’అని సూచిస్తున్నారు.
News March 30, 2026
US జెట్లకు ఎయిర్ స్పేస్ మూసేసిన స్పెయిన్

USకు నాటో దేశం స్పెయిన్ షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధానికి వెళ్తున్న US విమానాలకు గగనతలం మూసేశామని ప్రకటించింది. అలాగే సైనిక స్థావరాల వినియోగానికి వీల్లేదని చెప్పింది. ఏకపక్షంగా, అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా ప్రారంభించిన యుద్ధంలో పాల్గొనొద్దన్న తమ నిర్ణయంలో ఇదో భాగమని ఆ దేశ ఆర్థిక మంత్రి కార్లోస్ క్యూర్పో వెల్లడించారు. అయితే అత్యవసర పరిస్థితులలో ఈ గగనతల మూసివేత వర్తించదు.
News March 30, 2026
గోల్డ్ మైన్ వద్ద కాల్పులు.. 70 మంది దుర్మరణం

దక్షిణ సూడాన్‌లోని ఓ గోల్డ్ మైన్‌లో దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో 70 మందికి పైగా మరణించినట్లు పోలీసులు వెల్లడించారు. చాలా మంది గాయపడినట్లు తెలిపారు. జెబెల్ ఇరాక్ ప్రాంతంలోని బంగారు గనులపై ఆధిపత్యం కోసం అక్రమ గనుల తవ్వకందారులు, మైనింగ్ కంపెనీల మధ్య కొన్నేళ్లుగా హింసాత్మక ఘర్షణలు జరుగుతున్నాయి.


