News August 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 17, 2026

షర్ట్ లెస్ ఫొటో షేర్ చేసిన రామ్‌చరణ్

image

జిమ్‌లో వర్కౌట్ చేస్తూ షర్ట్ లెస్ ఫొటోను మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ SMలో షేర్ చేశారు. ‘ఉత్సాహంగా ఉన్నాను. సైలెంట్‌గా పనిచేస్తున్నాను. తదుపరి ఛాలెంజ్‌కు రెడీ’ అని క్యాప్షన్ పెట్టారు. RRR వంటి సినిమా తర్వాత చరణ్ చేస్తున్న పెద్ది సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా అన్ని రికార్డులను బ్రేక్ చేస్తుందని, అన్న బాడీ బాక్సాఫీస్ అని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఈ మూవీ మార్చి 27న రిలీజ్ కానుంది.

News January 17, 2026

తెలంగాణలో ఐపీఎస్‌ల బదిలీలు

image

రాష్ట్రంలో 20 మంది ఐపీఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రొవిజన్ అండ్ లాజిస్టిక్స్, స్పోర్ట్స్ వెల్ఫేర్ ఐజీగా గజరావ్ భూపాల్, ఫ్యూచర్ సిటీ ఏసీపీ(అడ్మిన్-ట్రాఫిక్)గా చందనా దీప్తి, హైదరాబాద్ ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వ రావు, విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీఐజీగా అభిషేక్ మహంతీ, సైబరాబాద్ డీసీపీ(అడ్మిన్)గా టి.అన్నపూర్ణ, సీఐడీ ఎస్పీగా వెంకటేశ్వర్లను నియమించింది.

News January 17, 2026

రక్తపాతానికి అమెరికా, ఇజ్రాయెల్ కారణం: ఖమేనీ

image

అమెరికా అధ్యక్షుడు ట్రంప్ క్రిమినల్ అని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ ఫైరయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక నిరసనల్లో ట్రంప్ హస్తం ఉందని ఆరోపించారు. ‘దేశంలో జరుగుతున్న విధ్వంసానికి, రక్తపాతానికి విదేశీయులే కారణం. అమెరికా, ఇజ్రాయెల్‌తో సంబంధం ఉన్న వారు భారీ నష్టాన్ని కలిగించి, వేలాది మందిని చంపారు. దేశాన్ని యుద్ధంలోకి లాగబోం. అలానే స్థానిక, అంతర్జాతీయ నేరస్థులను శిక్షించకుండా వదలబోం’ అని స్పష్టం చేశారు.