News August 26, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 27, 2025
వనపర్తి: ‘ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించాలి’

ఎన్నికలు శాంతియుతంగా నిర్వహించేందుకు సమగ్ర చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ శివధర్ రెడ్డి జిల్లా ఎస్పీలను వీడియో కాన్ఫరెన్స్‌లో ఆదేశించారు. నామినేషన్ నుంచి ఫలితాల వరకు అప్రమత్తంగా ఉండాలని, రౌడీషీటర్లు, రిస్క్ ఎలిమెంట్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ కాన్ఫరెన్స్‌లో వనపర్తి జిల్లా ఎస్పీ సునీత రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
News November 27, 2025
రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: చంద్రబాబు

AP: అమరావతిని రాజధానిగా గుర్తించాలని కేంద్రాన్ని కోరామని CM చంద్రబాబు తెలిపారు. రాజధాని రైతులకు క్యాపిటల్ గెయిన్స్ గడువును పొడిగించే అంశంపై కేంద్రంతో మాట్లాడతామని చెప్పారు. ‘అమరావతి అభివృద్ధి చెందాలి. ఈ ఫలాలను ఇక్కడి రైతులే ముందు అందుకోవాలి. వారికి న్యాయం చేయడం నా బాధ్యత. రెండో విడత ల్యాండ్ పూలింగ్‌లో భూములు తీసుకుని అభివృద్ధి చేద్దామని చూస్తున్నాం’ అని రాజధాని రైతులతో మీటింగ్‌లో పేర్కొన్నారు.
News November 27, 2025
ఇక పీరియడ్ బ్లడ్తో క్యాన్సర్ గుర్తించొచ్చు!

దేశంలో ఏటా 77వేల మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్‌తో చనిపోతున్నారు. దీనికి కారణం నొప్పిని కలిగించే PAP స్మియర్ వంటి పరీక్షలకు భయపడి మహిళలు చెక్ చేయించుకోకపోవడమే. ఈ నేపథ్యంలో అసౌకర్యాన్ని, అధిక ఖర్చును దృష్టిలో ఉంచుకుని వైభవ్ శితోలే బృందం ‘M-STRIP’ అనే స్వీయ పరీక్ష పరికరాన్ని అభివృద్ధి చేసింది. పీరియడ్ బ్లడ్తో పరీక్ష చేసుకుంటే ప్రాథమిక దశలోనే క్యాన్సర్‌ను గుర్తించి కాపాడుకోవచ్చని చెబుతున్నారు.


