News April 2, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 8, 2024

మార్స్‌పై అతి పురాతన మహాసముద్రం.. గుర్తించిన చైనా

image

అంగారకుడిపై కోటానుకోట్ల ఏళ్ల క్రితం మహాసముద్రం ఉండేదని చైనా పరిశోధకులు తేల్చిచెప్పారు. తాము పంపించిన ఝరాంగ్ రోవర్ అందుకు సంబంధించిన ఆధారాలను సేకరించిందని వారు వెల్లడించారు. ‘మార్స్‌పై ఉటోపియా ప్లానిషియా అనే ప్రాంతంలో నమూనాల ఆధారంగా పురాతన కాలంలో ఓ మహా సముద్రం ఉండేదని గుర్తించాం. సుమారు 3.42 సంవత్సరాల క్రితం ఆ సముద్రం ఎండిపోయింది. ఆ సమయంలో సూక్ష్మ జీవులు అక్కడ మనుగడ సాగించి ఉండొచ్చు’ అని తెలిపారు.

News November 8, 2024

గీజర్ వాడుతున్నారా? ఇవి తెలుసుకోండి!

image

చాలామంది గీజర్‌ను గంటల తరబడి ఆన్‌లోనే ఉంచుతారు. అది ఏమాత్రం మంచిదికాదు. ఒక్కోసారి గీజర్ ఓవర్ హీట్ ఎక్కి పేలిపోయే ప్రమాదం ఉంటుంది. ఇక గీజర్‌ను ఏడాదికోసారి సర్వీసింగ్ చేయించాలి. అప్పుడే ఏమైనా లీకేజీ ఉంటే తెలుస్తుంది. గీజర్ కనెక్షన్ వైర్లను ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండాలి. చాలా ఏళ్లుగా వాడుతున్న పరికరాలను మార్చడం ఉత్తమం. వాటి వల్ల షార్ట్ సర్య్కూట్ వచ్చే ప్రమాదం ఉంది.

News November 8, 2024

రోహిత్‌శర్మ నుంచి అది నేర్చుకున్నా: సూర్య

image

ఆటలో గెలుపోటములు సహజమని, ఓడినంత మాత్రాన మన మనస్తత్వం మార్చుకోవద్దని టీమ్ ఇండియా T20 కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ అన్నారు. ఆ విషయాన్ని రోహిత్‌శర్మను చూసే నేర్చుకున్నానని సూర్య చెప్పారు. రోహిత్ గ్రౌండ్‌లో ఎలా ఉంటారో తాను గమనిస్తూ ఉంటానన్నారు. అందరూ హార్డ్‌వర్క్ చేస్తారని, కొన్నిసార్లు కలిసొస్తే, కొన్నిసార్లు వర్కవుట్ కాదని సూర్య చెప్పుకొచ్చారు. రేపు సౌతాఫ్రికాతో T20 సిరీస్ ప్రారంభం కానుంది.