News September 14, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News March 30, 2026

రాబోయే 2-3 గంటల్లో వర్షం

image

TG: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాబోయే 2-3 గంటల్లో వర్షాలు పడతాయని HYD వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, జగిత్యాల, గద్వాల్, కొమురం భీమ్, మంచిర్యాల, నాగర్‌కర్నూల్, నల్గొండ, నిర్మల్, రంగారెడ్డి, సంగారెడ్డి, వికారాబాద్ జిల్లాల్లో ఉరుములతో కూడిన తేలికపాటి వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. ఇక మహబూబ్‌నగర్‌లో గరిష్ఠంగా 40.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయినట్లు పేర్కొంది.

News March 30, 2026

విద్యార్థులకు అలర్ట్.. సర్టిఫికెట్లు సిద్ధం చేసుకోండి!

image

TG: కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కానుండటంతో విద్యార్థులు తమకు అవసరమైన డాక్యుమెంట్స్‌ను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా బోనాఫైడ్, స్టడీ, టీసీ, ఆధార్ కార్డులతో పాటు ఇన్కమ్, క్యాస్ట్, నేటివిటీ సర్టిఫికెట్లను దగ్గర ఉంచుకోవాలి. అడ్మిషన్లు, స్కాలర్‌షిప్‌ల సమయంలో ఇబ్బందులు కలగకుండా ముందుగానే సమీపంలోని మీసేవా కేంద్రాల్లో అప్లై చేసుకోండి. సులభంగా ఇన్కమ్, క్యాస్ట్, నేటివిటీ సర్టిఫికెట్లను పొందండి.

News March 30, 2026

4 లక్షల చాక్లెట్స్ చోరీ.. కంపెనీ ఫన్నీ రియాక్షన్!

image

4.14 లక్షల చాక్లెట్లు చోరీ కావడంపై నెస్లే బ్రాండ్ ‘కిట్ క్యాట్’ ఫన్నీగా స్పందించింది. ‘కిట్‌క్యాట్‌తో బ్రేక్ తీసుకోమని మేం చెబుతుంటాం. కానీ ఈ దొంగలు మా స్లోగన్‌ను మరీ సీరియస్‌గా తీసుకున్నారు. ఏకంగా 12 టన్నుల చాక్లెట్లతో బ్రేక్ తీసుకున్నారు’ అని పేర్కొంది. మార్చి 26న చాక్లెట్ల లోడుతో ఇటలీ నుంచి పోలండ్ వెళ్తున్న ట్రక్కు మార్గమధ్యంలో మాయమైపోయింది. ఇప్పటికీ దాని ఆచూకీ తెలియరాలేదని నెస్లే తెలిపింది.