News September 19, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News December 4, 2025

VZM: జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ కేసులు పరిష్కరించాలి

image

ఈ నెల 13న జరుగనున్న జాతీయ లోక్ అదాలత్‌లో ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ మార్గంలో పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బబిత సూచించారు. ఉమ్మడి జిల్లా న్యాయమూర్తులతో గురువారం వీసీ నిర్వహించారు. రాజీ పడదగిన కేసులను ఇరు పక్షాల అంగీకారంతో రాజీ మార్గంలో శాశ్వత పరిష్కారం చేయాలన్నారు. లోక్ అదాలత్‌పై ప్రజలలో విస్తృత అవగాహన కల్పించేలా ప్రచారం నిర్వహించాలని సూచించారు.

News December 4, 2025

పుతిన్ పర్యటనతో భారత్‌కు లాభమేంటి?

image

* రెసిప్రోకల్ ఎక్స్ఛేంజ్ ఆఫ్ లాజిస్టిక్ సపోర్ట్(RELOS): ఈ ఒప్పందం ద్వారా భారత్‌కు సైనిక సహకారం, యుద్ధ నౌకలు, విమానాలకు లాజిస్టిక్ సపోర్ట్ దొరుకుతుంది. గగనతలాలను వాడుకోవడం సులభతరమవుతుంది.
* రష్యా న్యూక్లియర్ పవర్డ్ సబ్‌మెరైన్‌ను భారత్‌కు లీజుకు ఇవ్వనుంది. ఈ డీల్ విలువ $2 బిలియన్లు. దీనిద్వారా ఇండియా సముద్ర సరిహద్దులు మరింత బలోపేతమవుతాయి.

News December 4, 2025

మళ్లీ తగ్గిన బంగారం ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో గంటల వ్యవధిలోనే <<18465069>>మరోసారి<<>> బంగారం ధరలు తగ్గి కొనుగోలుదారులకు ఊరటనిచ్చాయి. 24 క్యారెట్ల 10గ్రాముల గోల్డ్ రేటు ఇవాళ రూ.920 తగ్గి రూ.1,29,660కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10గ్రాముల పసిడి ధర రూ.850 పతనమై రూ.1,18,850 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.2,00,000గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలున్నాయి.