News September 22, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 27, 2025
అనంత: స్కూల్ బస్సుల ఫిట్నెస్పై తనిఖీ చేయనున్న అఫీసర్

ఈనెల 28 నుంచి డిసెంబర్ 4 వరకు జిల్లాలో అన్ని స్కూలు బస్సులను తనిఖీ చేయడం జరుగుతుందని ఉప రవాణా కమిషనర్ ఎం. వీర్రాజు తెలిపారు. అనంతపురం జిల్లా రవాణా శాఖ అధికారులు కూడా స్కూల్ బస్సులపై ప్రత్యేకంగా ఉంచాలన్నారు. అగ్నిమాపక పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్లు వాటి పనితీరు పట్ల సమగ్రంగా తనిఖీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. ఇప్పటికే అన్ని విద్యాసంస్థల యాజమాన్యాలకు నోటీసులు పంపించామన్నారు.
News November 27, 2025
ట్రేడ్ మోసం.. ₹35 కోట్లు నష్టపోయిన పెద్దాయన

ట్రేడ్ ఫ్రాడ్ వల్ల ₹35 కోట్లు నష్టపోయారో వ్యాపారవేత్త. ముంబైకి చెందిన భారత్ హారక్చంద్ షా(72) వారసత్వంగా వచ్చిన షేర్లను 2020లో గ్లోబ్ క్యాపిటల్ మార్కెట్స్ కంపెనీ డిమ్యాట్ అకౌంట్కు బదిలీ చేశారు. కంపెనీ ఉద్యోగులు ఆయన ఖాతాను చూసుకుంటామని చెప్పి 2020-24 మధ్య ఫ్రాడ్ చేశారు. ఈ క్రమంలో ₹35 కోట్ల అప్పు ఉందని కంపెనీ చెప్పడంతో ఆయన షాకయ్యారు. మొత్తం అప్పును చెల్లించిన షా.. తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు.
News November 27, 2025
ఇల్లు మూలల ఆధారంగా ఉంటే ఏ దిక్కున పడుకోవాలి?

ఇల్లు మూలలకు ఉన్నప్పుడు నైరుతి మూలకు తల, ఈశాన్య మూలకు కాళ్లు పెట్టుకుని పడుకోవడం మంచిదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. ఇది చక్కటి నిద్రకు, ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు. ‘నైరుతి స్థిరమైన శక్తినిస్తుంది. ఈశాన్యం నుంచి పాదాల ద్వారా శుభకరమైన కాస్మిక్ శక్తిని స్వీకరించడానికి సహాయపడుతుంది. అలాగే పనుల పట్ల ఏకాగ్రతను పెంచుతుంది’ అని వివరిస్తున్నారు. <<-se>>#Vasthu<<>>


