News September 23, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News December 4, 2025
BREAKING: సెలవుల జాబితా ప్రకటించిన ప్రభుత్వం

AP: 2026కు సంబంధించిన ప్రభుత్వ ఉద్యోగుల సెలవుల జాబితాను ఏపీ ప్రభుత్వం విడుదల చేసింది. మొత్తం 24 జనరల్ హాలిడేస్, 21 ఆప్షనల్ హాలిడేస్ ఉన్నాయి. జనరల్ సెలవుల్లో మహాశివరాత్రి(ఫిబ్రవరి 15), బాబు జగ్జీవన్ రామ్ జయంతి(ఏప్రిల్ 5), దుర్గాష్టమి(అక్టోబర్ 18), దీపావళి(నవంబర్ 8) ఆదివారం వచ్చాయి. పైన ఫొటోల్లో సెలవుల లిస్టును చూడొచ్చు. వీటిని బట్టి మీ ట్రిప్స్ను ప్లాన్ చేసుకోండి.
News December 4, 2025
సింగపూర్ లాంటి దేశాన్నీ ఇబ్బంది పెట్టారు: CM

AP: గత పాలకులు సింగపూర్ లాంటి దేశాన్ని, ఆ దేశ కంపెనీలను ఇబ్బంది పెట్టారని CM CBN విమర్శించారు. ‘ఆ బ్యాడ్ ఇమేజ్ చెరిపి బ్రాండ్ ఇమేజ్ తేవడంతో ఇపుడు పెట్టుబడులు వస్తున్నాయి. ఇటీవలి MOUలన్నీ 45 రోజుల్లో గ్రౌండ్ కావాలి. భూ సేకరణలో వివాదాలు రాకూడదు. భూములిచ్చిన వాళ్లు, తీసుకున్న వాళ్లు సంతోషంగా ఉండాలి’ అని అధికారులకు సూచించారు. UAE మాదిరి APలో ₹500 కోట్లతో సావరిన్ ఫండ్ ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.
News December 4, 2025
టోల్ ప్లాజాస్ @ 25 ఇయర్స్

దేశంలో పబ్లిక్-ప్రైవేట్ భాగస్వామ్యం(PPP)లో టోల్ ప్లాజాలు ఏర్పాటై 25 ఏళ్లు అయింది. ప్రభుత్వ రహదారులు, బ్రిడ్జిలపై టోల్ వసూలుకు 1851లో చట్టం చేశారు. 1970లలో దేశంలో రహదారుల నిర్మాణం, టోల్ వసూలు పద్ధతులు ప్రవేశపెట్టారు. 2000 నుంచి ప్రారంభమైన టోల్ ప్లాజాల ద్వారా ప్రభుత్వానికి ప్రతి ఏడాది భారీగా ఆదాయం వస్తోంది. 2024-25లో రూ.73 వేల కోట్లు వసూలవగా.. ఈ ఏడాది రూ.80 వేల కోట్లు వసూలు కావొచ్చని అంచనా.


