News September 25, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News January 18, 2026

పాక్ సరిహద్దుల్లో AK-47 రైఫిళ్లు, పిస్టళ్లు లభ్యం

image

పంజాబ్‌లోని పఠాన్‌కోట్ జిల్లా సరిహద్దుల్లో పోలీసులు భారీగా ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. కేంద్ర నిఘా సంస్థలతో కలిసి నిర్వహించిన ఆపరేషన్‌లో 3 AK-47 రైఫిళ్లు, 5 మ్యాగజైన్లు, తుర్కియే, చైనా తయారీ పిస్టళ్లు, 98 బుల్లెట్లు లభ్యమయ్యాయి. దేశంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేందుకు పాక్ నుంచి ఈ ఆయుధాలను పంపినట్లు అధికారులు భావిస్తున్నారు. పాక్ గూఢచార సంస్థ ISI అండ ఉన్న ఉగ్రవాదుల పనేనని అనుమానిస్తున్నారు.

News January 18, 2026

4రోజుల్లో రూ.82కోట్లు కలెక్ట్ చేసిన ‘అనగనగా ఒక రాజు’

image

నవీన్ పొలిశెట్టి హీరోగా నటించిన ‘అనగనగా ఒక రాజు’ బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్లు రాబడుతోంది. సంక్రాంతి కానుకగా ఈనెల 14న విడుదలై 4 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.82కోట్లు (గ్రాస్) వసూలు చేసినట్టు నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్మెంట్స్ ట్వీట్ చేసింది. ‘సంక్రాంతి రారాజు బాక్సాఫీస్ ధమాకా పేలుతూనే ఉంటుంది’ అని క్యాప్షన్ పెట్టింది. మీనాక్షీ చౌదరి హీరోయిన్‌గా నటించిన ఈ సినిమాకు మారి దర్శకత్వం వహించారు.

News January 18, 2026

ఏపీలో 424 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

image

<>EdCIL<<>> APలో 424 డిస్ట్రిక్ట్ కెరీర్& మెంటల్ హెల్త్ కౌన్సిలర్స్ పోస్టులకు అప్లై చేయడానికి ఇవాళే ఆఖరు తేదీ. పోస్టును బట్టి MSc/MA, BA/BSc(సైకాలజీ), MSc/M.Phil, MSW, MSc(సైకియాట్రిక్ నర్సింగ్) ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. గరిష్ఠ వయసు 45ఏళ్లు. నెలకు జీతం 30వేలు+రూ.4వేలు అలవెన్సులు చెల్లిస్తారు. వెబ్‌సైట్: www.edcilindia.co.in/