News September 28, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి

Similar News

News November 26, 2025

ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలు సీజ్: సీఎం

image

AP: రాష్ట్రంలో ప్రతి రోడ్డుప్రమాదంపై థర్డ్ పార్టీ ద్వారా ఆడిటింగ్ నిర్వహించాలని CM చంద్రబాబు ఆదేశించారు. ప్రమాదానికి కారణం వాహనమా, డ్రైవరా లేదా రోడ్డు ఇంజినీరింగ్ లోపమా అన్న వివిధ అంశాలను గుర్తించేలా ఈ ఆడిటింగ్ జరగాలన్నారు. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 15,462 రహదారి ప్రమాదాల్లో 6,433 మంది మృతి చెందటంపై ఆందోళన వ్యక్తం చేశారు. హెచ్చరికలు జారీ చేసినా ఓవర్ స్పీడ్‌తో వెళ్లే వాహనాలను సీజ్ చేయాలని ఆదేశించారు.

News November 26, 2025

2 కోట్ల ఆధార్ ఐడీల తొలగింపు.. కారణమిదే!

image

దేశవ్యాప్తంగా 2 కోట్ల ఆధార్ ఐడీలను UIDAI డీయాక్టివేట్ చేసిందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. డేటా క్లీనింగ్‌లో భాగంగా చనిపోయిన వ్యక్తుల వివరాలను డిసేబుల్ చేసినట్లు చెప్పింది. ఆధార్ దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ఇలా చేసినట్లు పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు, భారత రిజిస్ట్రార్ జనరల్ నుంచి వచ్చిన డెత్ రిజిస్ట్రేషన్లు, ఇతర సమాచారం ఆధారంగా డీయాక్టివేట్ చేసినట్లు వెల్లడించింది.

News November 26, 2025

బాలిస్టిక్ క్షిపణి పరీక్షించిన పాకిస్థాన్

image

యాంటీ షిప్ బాలిస్టిక్ క్షిపణిని విజయవంతంగా ప్రయోగించినట్లు పాకిస్థాన్ మిలిటరీ ప్రకటించింది. ‘స్థానికంగా నిర్మించిన నేవల్ ప్లాట్‌ఫామ్ నుంచి మిస్సైల్ పరీక్షించాం. సముద్రం, భూమిపై ఉన్న లక్ష్యాలను ఇది అత్యంత కచ్చితత్వంతో ఛేదించగలదు. ఇందులో అత్యాధునిక గైడెన్స్ వ్యవస్థలు ఉన్నాయి’ అని పేర్కొంది. కాగా మే నెలలో భారత్ నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ తర్వాతి నుంచి పాకిస్థాన్ ఈ తరహా ప్రయోగాలను పెంచింది.