News September 30, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 11, 2025

వీఎంఆర్డీఏ కమిషనర్‌గా ఎన్.తేజ్‌భరత్

image

విశాఖ మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అధారిటీ కమినర్‌గా ఎన్.తేజ్ భరత్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. 2018 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఈయన ప్రస్తుతం మెప్మా డైరెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. గతంలో ఇక్కడ పనిచేసిన కేఎస్ విశ్వనాథన్‌ను ఐఅండ్ పీఆర్ డైరెక్టర్‌గా బదిలీ చేసినప్పటి నుంచి ఆ పోస్టు ఖాళీగా ఉంది.

News November 11, 2025

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదా?

image

ఢిల్లీ బ్లాస్ట్ సూసైడ్ అటాక్ కాదని, భయాందోళనలో తొందరపడి చేసిన దాడిగా దర్యాప్తు సంస్థలు ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్లు ANI పేర్కొంది. ‘టెర్రర్ నెట్‌వర్క్స్‌పై దాడుల నేపథ్యంలో ఆ ఒత్తిడిలో ఇలా చేసి ఉండొచ్చు. నిందితుడు రెగ్యులర్ సూసైడ్ బాంబింగ్ పాటర్న్ ఫాలో కాలేదు. ఇంటెన్షనల్‌గా దేనిని ఢీకొనలేదు. పూర్తిగా డెవలప్ కాని బాంబును వాడటంతో తీవ్రత తగ్గింది’ అని దర్యాప్తు అధికారులు భావిస్తున్నట్లు తెలిపింది.

News November 11, 2025

జూబ్లీహిల్స్‌లో BRS గెలుపు: మిషన్ చాణక్య ఎగ్జిట్ పోల్

image

TG: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో BRS పార్టీ గెలుస్తుందని ‘మిషన్ చాణక్య’ ఎగ్జిట్ పోల్ వెల్లడించింది. BRSకు 41.60%, కాంగ్రెస్‌కు 39.43%, BJPకి 18.97% ఓటు షేర్ వస్తుందని పేర్కొంది. షేక్‌పేట్, బోరబండ, ఎర్రగడ్డ, వెంగళరావు నగర్, సోమాజిగూడ డివిజన్లలో BRSకు, యూసుఫ్‌గూడ, రహమత్ నగర్‌ డివిజన్లలో కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యం వస్తుందని తెలిపింది.