News October 6, 2024

పుట్టినరోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.

Similar News

News November 27, 2025

పాలమూరు: పల్లె పోరు.. మొదటి విడతకు నేడు నామినేషన్లు

image

ఉమ్మడి పాలమూరు జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు నగారా మోగింది. నేటి నుంచి ఈనెల 29 వరకు మొదటి విడత నామినేషన్లు స్వీకరిస్తారు. జిల్లాలోని 1,678 GPలు, 15,068 వార్డులు ఉన్నాయి. మొత్తం 23,19,178 మంది ఓటర్లు ఉండగా అందులో పురుషులు 11,49,056, మహిళలలు 11,70,079, ఇతరులు 43 మంది ఉన్నారు. పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగనుండగా అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చేశారు. ఎన్నికల కోడ్ డిసెంబర్ 17 వరకు అమలులో ఉంటుంది.

News November 27, 2025

చేబ్రోలు విద్యార్థిని అభినందించిన ట్రైనీ కలెక్టర్

image

గొల్లప్రోలు మండలం చేబ్రోలు జిల్లా పరిషత్ హై స్కూల్ లో చదువుతున్న అమూల్య ట్రైనీ కలెక్టర్ మనీషా చేతుల మీదుగా ప్రశంస పత్రం అందుకుంది. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా నిర్వహించిన పోటీలలో పదోతరగతి చదువుతున్న అమూల్య ఉత్తమ ప్రజలు కనబరిచింది. బుధవారం ట్రైనీ కలెక్టర్ మనీషా చేతుల మీదుగా ప్రశంసా పత్రం, మెడల్ అందుకుంది. అమూల్యను పాఠశాల ఉపాధ్యాయులు గ్రామ పెద్దలు అభినందించారు.

News November 27, 2025

ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు

image

*TG: పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై హైకోర్టులో పిటిషన్లు.. రేపు విచారణ
*SAతో టెస్ట్ సిరీస్‌లో IND ఘోర ఓటమి.. 2-0తో వైట్‌వాష్
*AP: మరో 15 ఏళ్లు కూటమి ప్రభుత్వమే: పవన్ కళ్యాణ్‌
*రేవంత్ రూ.50వేల కోట్ల పవర్ స్కాం: హరీశ్‌
*APలో స్టూడెంట్ అసెంబ్లీ.. ప్రశ్నలు, వివరణలతో ఆకట్టుకున్నవిద్యార్థులు
*బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. రేపటికి వాయుగుండంగా మారవచ్చన్న APSDMA