News October 22, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News November 19, 2025
మాదాపూర్ శిల్పారామంలో ఆకట్టుకున్న నృత్య ప్రదర్శన

HYD మాదాపూర్ శిల్పారామంలో కళాకారులు కూచిపూడి నృత్యప్రదర్శనతో సందర్శకులను ఆకట్టుకున్నారు. బుధవారం గురువు సుప్రియ శిష్యబృందం జయము జయము, శ్రీరంగనాథం, ముద్దుగారే యశోద, ఓం శర్వాణి, జయజయ దుర్గే, అన్నమాచార్య కీర్తనలు, శ్యామల మీనాక్షి, సీతా కళ్యాణం తదితర అంశాలను ప్రదర్శించారు. కళాకారులు చైత్ర, రూప, హరిణి, రిషిత, సమీక్షిత, శ్రీనిక, ప్రమీత, దక్ష, యుక్తశ్రీ, మోక్షిత పాల్గొన్నారు.
News November 19, 2025
విమర్శలపై స్పందించిన ఉపాసన

ఇటీవల పెళ్లిపై తాను చేసిన <<18327888>>వ్యాఖ్యలు<<>> విమర్శలకు దారి తీయడంపై ఉపాసన స్పందించారు. ‘నేను 27 ఏళ్లకు పెళ్లి చేసుకున్నా. వ్యక్తిగత కారణాలతో 36 ఏళ్లకు తల్లి అయ్యా. నా ప్రయాణంలో పెళ్లితో పాటు కెరీర్కు సమప్రాధాన్యం ఇచ్చా. నా దృష్టిలో ఆ రెండింటికి పోటీ లేదు. ఓ మహిళ సరైన భాగస్వామి దొరికాకే పెళ్లి చేసుకోవడం తప్పా? వ్యక్తిగత పరిస్థితులతో పిల్లలను ఎప్పుడు కనాలో నిర్ణయించుకోకూడదా’ అని ప్రశ్నించారు.
News November 19, 2025
బీట్రూట్.. శీతాకాలం బూస్టర్ అని తెలుసా?

చలికాలంలో వచ్చే సమస్యలకు బీట్రూట్తో చెక్ పెట్టవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే నైట్రేట్లు, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడుతాయి. శరీరంలో ఆక్సిజన్ ప్రసరణను మెరుగుపరుస్తాయి. ఒక గ్లాస్ బీట్రూట్ జ్యూస్ లేదా ఉడకబెట్టిన బీట్రూట్ చలికాలంలో వచ్చే ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. రోగనిరోధక శక్తి, రక్త ప్రసరణ, జీర్ణక్రియ, స్కిన్ హెల్త్ సమస్యల పరిష్కారానికి చక్కగా పనిచేస్తుంది.


