News April 8, 2024
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
Similar News
News October 16, 2025
మహిళలు రోజూ గుమ్మడి గింజలు తింటే?

గుమ్మడి గింజల్లో విటమిన్లు, ఫైబర్, ప్రొటీన్లు, ఖనిజాలు, యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. మహిళలు రోజూ 10 గుమ్మడి గింజలను తింటే టైప్-2 డయాబెటిస్, హైబీపీ, గర్భధారణ సమస్యలు, మూత్రనాళాల ఇన్ఫెక్షన్లు తగ్గుతాయి. ఎముకలు దృఢంగా అవుతాయి. కొలెస్ట్రాల్ అదుపులో ఉంటుంది. గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది. PCOS, థైరాయిడ్, ఊబకాయం లాంటి సమస్యలు తగ్గుతాయి.
#ShareIt
News October 16, 2025
దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

గతేడాది దీపావళి సీజన్లో 10 గ్రాముల సిల్వర్ ధర రూ.1,100 ఉంటే ఈ ఏడాది అదే సమయానికి దాదాపు రెట్టింపయింది. ప్రపంచవ్యాప్తంగా వెండి కొరత, మైనింగ్ తగ్గడం తదితర కారణాలతో ప్రస్తుతం KG వెండి ధర రూ.2 లక్షలు దాటింది. అయితే పండగ తర్వాత ధరలు తగ్గొచ్చని మార్కెట్ ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. సప్లై పెరగడం, కీలక రంగాల మందగమనం, ఇన్వెస్టర్లు ప్రత్యామ్నాయంపై దృష్టి పెట్టడం వంటివి కారణాలుగా చెబుతున్నారు.
News October 16, 2025
AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది: మోదీ

ఏపీలో గూగుల్ లాంటి పెద్ద కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టిందని, ఇది సీఎం చంద్రబాబు విజన్ అని ప్రధాని మోదీ అభినందించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI)కు ఏపీ తొలి గమ్యస్థానంగా మారిందని చెప్పారు. ఈ ఏఐ హబ్లో ఏఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, డేటా సెంటర్, ఎనర్జీ స్టోరేజీ, ఫైబర్ ఆప్టిక్ నెట్వర్క్లు ఉంటాయని తెలిపారు. విశాఖపట్నం ఏఐ, కనెక్టివిటీ హబ్గా ప్రపంచానికి సేవలు అందించనుందని పేర్కొన్నారు.